NTV Telugu Site icon

Palla Rajeshwar Reddy : అధికారులు కూడా సీఎం అబద్దాలను చూసి సిగ్గుపడుతున్నారు

Palla Rajeshwar Reddy

Palla Rajeshwar Reddy

సీఎం రేవంత్ రెడ్డి పొద్దట్నుంచి అన్ని చోట్ల బూతులు మాట్లాడారని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయన భాష ను చూసి అందరూ సిగ్గుతో తల వంచుకుంటున్నారని, అధికారులు కూడా సీఎం అబద్దాలను చూసి సిగ్గుపడుతున్నారన్నారు. 30 వేల ఉద్యోగాల పై ,సీతారామ సాగర్ పై సీఎం వి మంత్రులవి అబద్దాలే అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం రాష్ట్రం లో బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ అంటున్నారని, రైతు రుణ మాఫీ పై సీఎం ది అతి పెద్ద మోసపూరిత వైఖరి అని, మొదట రుణ మాఫీకి 40 వేల కోట్లు అవుతుందన్నారు ..తర్వాత 31 వేల కోట్లు అన్నారు ..ఇపుడు వేసింది 17 వేల కోట్లు మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. హరీష్ రావు నీ మెడలు వంచి రుణ మాఫీ చేయించారని ఆయన వెల్లడించారు. దేవుడి మీద ఒట్లు లేకపోతే తిట్లు అనేది ఈ సీఎం వైఖరి అని, హరీష్ రావు ఆరు గ్యారంటీలు ,రుణ మాఫీ ఆగస్టు 15 లోగా చేస్తే రాజీనామా చేస్తానన్నారన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆ రాజీనామా లేఖను మీడియా మిత్రులకు ఇచ్చారని, హరీష్ రావు ఒత్తిడి తో సగం రుణ మాఫీ అయినా చేశారన్నారు. సీఎం రేవంత్ భాషను పశువులు కూడా సహించవని, హరీష్ రావు ఏడు సార్లు ఎమ్మెల్యే .రెండు సార్లు రాజీనామా చేశారని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం చిల్లర చిచోరా భాష ను మాట్లాడేందుకు మాకు సంస్కారం అడ్డు వస్తోందని, రాహుల్ గాంధీ కి సీఎం మీద నమ్మకం లేకే రుణమాఫీ సంబరాలకు రాలేదన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

Minister Seethakka : మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్?

అనంతరం.. ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర దినోత్సవం రోజున కూడా సీఎం రేవంత్ బూతు పురాణం అందుకోవడం సిగ్గు చేటని, రుణ మాఫీ పూర్తి చేయనందుకు సీఎం రేవంత్ అమరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలన్నారు. డైవర్షన్ రాజకీయాల్లో భాగం గానే రేవంత్ బూతులు అని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లను తిట్టక పోతే రేవంత్ కు పూట గడవడం లేదని ఆమె మండిపడ్డారు. రేవంత్ ఎన్ని తిట్టినా హామీల పై బీ ఆర్ ఎస్ నిలదీస్తూనే ఉంటామన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సిగ్గు లజ్జ లేకుండా హరీష్ రావు పై అసభ్య విమర్శలు చేశారని, దేవుళ్ళ ను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. సూటి గా చెప్పు 31 వేల కోట్ల రుణ మాఫీ చేశావా లేదా అని, కేవలం 17 వేల కోట్ల రూపాయలు మాత్రమే అకౌంట్ల లో వేశావ్ అని ఆయన అన్నారు. సిగ్గుంటే సీఎం రేవంత్ ముక్కు నేలకు రాసి పదవికి రాజీనామా చేయాలన్నారు.

Credit card: క్రెడిట్ కార్డులను క్లోజ్‌ చేసుకోవాలా.. ఆర్బీఐ రూల్స్‌ తెలుసా..?