32 జిల్లాల్లో వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయని, 72 లక్షల ఎకరాల్లో పంటలు వేశారన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. దేశంలోనే అత్యధిక శాతం పంటలు వేసిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు. మూడు రోజుల క్రితమే రైతులను మంత్రులు పరామర్శించారని, ముఖ్యమంత్రి అన్ని జిల్లా కలెక్టర్‌లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని ఆయన వివరించారు. 80 వేల మంది రైతులకు చెందిన 1లక్ష 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, పంట నష్టం అంచనా వేస్తున్నారు. 2603 క్లస్టర్స్ నుంచి వివరాలు సేకరిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు రైతుల్లో భరోసా కల్పిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం.
Also Read : Meal Maker: మీల్ మేకర్‌తో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు విడిచిపెట్టొద్దు
రైతుల్ని ఆదుకుంటామని, కేంద్రం టీమ్ లను పంపాలి. నష్ట పోయిన పంటలకు ఆర్థిక సహాయం చేయాలన్నారు. గతంలో వరదల సమయంలో 7 వేల కోట్ల సహాయం అడిగితే 230 కోట్లు కేంద్రం ఇచ్చిందని, గవర్నర్ కూడా పోటీ పడి పరామర్శించారన్నారు. తెలంగాణ మీద కోపం పెట్టుకోకుండా కేంద్రం సహాయం చేయాలని, ఫజల్ భీమా యోజన అనే అర్ధరహిత పాలసీ కేంద్రం తెచ్చిందని, అన్ని రాష్ట్రాలు ఇందులో నుంచి బయటకు వస్తున్నాయని, దీని వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకే అధిక లబ్ధి జరుగుతుందన్నారు.
Also Read : Chandrababu Naidu: శాసన సభ కాదు.. కౌరవ సభ.. చరిత్రలో ఇది చీకటి రోజు.
రైతులను ఆదుకునేందుకు కొత్త పాలసీ కేంద్రం తీసుకు రావాల్సి ఉందన్నారు. నిరుద్యోగులను అవమానపరిచే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, 95 శాతం తెలంగాణ వారికే ఉద్యోగాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువచ్చిందని, ఎవరో ఫిర్యాదు చేస్తేనో, ఎవరో చెబితేనో చర్యలు తీసుకోలేదన్నారు. టీఎస్పీఎస్సీ అనుమానంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు.