మీల్ మేకర్స్‌ని సోయా చంక్స్ అని కూడా అంటారు. ఇవి రుచికరంగా ఉండటంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తాయి.
సోయాలో ప్రోటీన్లు ఎక్కువగా మోతాదులో ఉంటాయి. మాంసం తినని వారు వీటిని తింటే.. శరీరానికి ప్రోటీన్లు బాగా లభిస్తాయి.
సోయాలో పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. వీటి వల్ల శరీరానికి పోషణ లభిస్తుంది.
సోయాలో ఉండే కాల్షియం, ఐరన్.. ఎముకల్ని బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
మీల్ మేకర్స్.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో తోడ్పడుతాయి.
అధిక బరువుని తగ్గించడంలో మీల్ మేకర్స్ కీలక పాత్ర పోసిస్తాయి. కాబట్టి.. వీటిని తింటే మంచింది.
మీల్ మేకర్స్ చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తాయి. ముఖంపై ఉన్న మొటిమలు, ముడతల్ని తొలగిస్తాయి.
మీల్ మేకర్స్ జుట్టు సమస్యలని నివారిస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి, పొడవైన జుట్టు పెరగడంలో సహకరిస్తాయి.
ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి.. జీర్ణ సమస్యలు ఉండవు. సులభంగా జీర్ణమవుతాయి.
మీల్ మేకర్‌లో మెగ్నీషియం సమృద్దిగా ఉంటుంది. ఇది నిద్రలేమి సమస్య లేకుండా చేస్తుంది.