NTV Telugu Site icon

Palakurthi Thikkareddy: కౌతాళంలో లోకేష్ జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి తిక్కారెడ్డి

Thikka Reddy

Thikka Reddy

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జి పాలకుర్తి తిక్కారెడ్డి పాల్గొని కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో విజన్ కలిగి ఉన్న నాయకుడు నారా లోకేష్ బాబు అని అన్నారు. పాదయాత్ర చేసి యువత ఎదురుకుంటున్న సమస్యలు, ఉద్యోగ, ఉపాధి సమస్యలు తెలుసుకుంటూ.. రైతులు, మహిళలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పాదయాత్రలో తెలుసుకున్నారని తెలిపారు.

Read Also: Narasaraopet MLA: ఎంపీ రాజీనామాతో పార్టీకి నష్టం లేదు: ఎమ్మెల్యే గోపిరెడ్డి

రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాదయాత్రలో తెలుసుకున్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి ముందుండి ప్రభుత్వాన్ని నడిపే నాయకుడు నారా లోకేష్ బాబు అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నారా లోకేష్ జీవితంలో ఆరోగ్యంగా, మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి రాజు, నీలకంఠ రెడ్డి, వెంకటరెడ్డి, రమేష్ గౌడ్, మైనార్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు టిప్పు సుల్తాన్, డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రాజానంద్, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు, యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి రాజాబాబు, కావలి ఈరప్ప తదితరులు పాల్గొన్నారు.

Read Also: Minister Seethakka: అటవీశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు..