Site icon NTV Telugu

Operation Sindoor Effect: మమల్ని క్షమించండి.. యుద్ధం ఆపేయండి! వెక్కి వెక్కి ఏడ్చిన టీవీ యాంకర్..

Operation Sindoor Effect

Operation Sindoor Effect

Operation Sindoor Effect: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో భారతీయులపై జరిగిన ఉగ్రదాడికి భారత ప్రభుత్వం గట్టి సమాధానం ఇచ్చింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. ఈ దాడి మంగళవారం అర్థరాత్రి తర్వాత బుధవారం తెల్లవారుజామున 1:44 గంటలకు ప్రారంభమై, కేవలం 23 నిమిషాల్లోనే ముగిసింది. మొత్తంగా 9 ఉగ్ర స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. ఈ మెరుపుదాడులతో పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐ, ఉగ్రవాద సంస్థలకు పెద్ద దెబ్బగా మారాయి. ఈ ఎటాక్ దెబ్బకు దాదాపు 90 మందికి పైగా ఉగ్రవాదులు మృతిచెందినట్లు సమాచారం. ఇందులో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అతని కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మరణించినట్టు సమాచారం.

Read Also: Pakistan: 80 విమానాలతో భారత్ దాడి, రైలు హైజాక్‌లో ప్రమేయం.. పాక్ ప్రధాని అబద్ధాలు..

ఈ దాడులలో పాకిస్తాన్‌లో తీవ్ర భయానక వాతావరణం నెలకొంది. ఇక ఈ దాడులపై పాకిస్తాన్ మీడియాలో తీవ్ర ఉద్వేగం వ్యక్తమవుతోంది. అయితే, పాకిస్తాన్‌కు చెందిన ఓ ప్రముఖ న్యూస్ యాంకర్ లైవ్ న్యూస్ మధ్యలోనే ఏడవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత దాడులతో పాకిస్థాన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని, తమను ఆదుకోవాలని ఆ యాంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, నెటిజన్లు మాత్రం దీనిపై సూటిగా స్పందిస్తున్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించడమే ఈ దుస్థితికి కారణమని మండిపడుతున్నారు. సామాన్య ప్రజలను మతం అడిగి కాల్చినప్పుడు ఎందుకు ఏడవలేదని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version