NTV Telugu Site icon

India-Pak: సరిహద్దుల్లో పాక్ దుశ్చర్య..ఫెన్సింగ్ కట్ చేసిన పాక్ పౌరులు

Bharath Pak

Bharath Pak

భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్‌కు చెందిన మరోదుశ్చర్య ఆలస్యంగా వెలుగు చూసింది. పాకిస్థాన్ పౌరులు సరిహద్దులోని 25 మీటర్ల పొడవైన ఫెన్సింగ్ ను కత్తిరించి దాన్ని తీసుకువెళ్లారు. ఆ తర్వాత పాకిస్థాన్‌కు చెందిన దాదాపు 401 గొర్రెలు, మేకలు సరిహద్దు నుంచి భారత సరిహద్దులోకి ప్రవేశించాయి. ఫెన్సింగ్‌ను కత్తిరించినట్లు వార్తలు వచ్చిన తర్వాత..బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ పై ప్రశ్నలు తలెత్తాయి. ఫెన్సింగ్‌ను కత్తిరించిన విషయం వెలుగులోకి రావడంతో.. బీఎస్ఎఫ్ ధనౌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

READ MORE: Doctor Died: అమెరికాలో తెనాలికి చెందిన వైద్యురాలు మృతి.. మృతదేహం కోసం కుటుంబం ఎదురుచూపులు

సరిహద్దులో ఫెన్సింగ్‌ను కత్తిరించిన ఈ సంఘటన జులై 16 న జరిగినట్లు చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతంలో కొందరు పాకిస్థాన్ పౌరులు సరిహద్దులో ఉన్న ఫెన్సింగ్‌ను కత్తిరించి తమతో తీసుకెళ్లారు. దాదాపు 25 మీటర్ల పొడవైన కంచెను కత్తిరించారు. దీనిపై సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్ అధికారులు.. పాక్ రేంజర్‌కు విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత పాక్ రేంజర్లు తమ ప్రాంతంలోని గ్రామస్థులను సంప్రదించి ఫెన్సింగ్‌ను తీసుకొచ్చారు. అయితే.. కత్తిరించిన ఫెన్సింగ్‌ను సరిచేయడానికి సమయం పడుతుంది. ఫెన్సింగ్ లేకపోవడంతో పాకిస్థాన్ ప్రజలకు చెందిన పలు జంతువులు భారత సరిహద్దులోకి ప్రవేశించాయి. వాటిని బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. ఈ గొర్రెలు, మేకలు తిరిగి వారి అప్పజెప్పారా లేదా.. అనే అంశంపై ఇంకా సమాచారం అందలేదు.

READ MORE: Doctor Died: అమెరికాలో తెనాలికి చెందిన వైద్యురాలు మృతి.. మృతదేహం కోసం కుటుంబం ఎదురుచూపులు

కాగా.. ఈ మధ్య కాలంలో జమ్మూ అనేక పెద్ద ఉగ్రదాడులతో వణికిపోయింది. సామాన్య ప్రజలతో పాటు సైన్యం కూడా తీవ్రవాదుల వలలో చిక్కుకుంది. పాకిస్థాన్ నుంచి 50 నుంచి 55 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉగ్రవాదులను పట్టుకునేందుకు నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. దీంతో పాటు ఉగ్రవాదులు దాగి ఉన్నారని అనుమానిస్తున్న దోడా అడవుల్లో 500 మంది పారా స్పెషల్ కమాండోలను మోహరించారు. ఈ ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత సైన్యం ఇప్పుడు పూర్తి వ్యూహం రచించింది.