NTV Telugu Site icon

PM Modi: రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పాకిస్థాన్ తహతహలాడుతోంది

Pm Modi

Pm Modi

Lok Sabha Election 2024: లోక్‌సభ మూడో దశ ఎన్నికలకు ముందు గుజరాత్‌లోని ఆనంద్‌ నగర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. గత 60 ఏళ్లుగా బ్యాంకులను కాంగ్రెస్‌ కబ్జా చేసిందని అన్నారు. కాంగ్రెస్ యువరాజులు రాజ్యాంగాన్ని నుదిటిపై పెట్టుకుని నృత్యం చేస్తున్నారు.. మోడీ రాకముందు ఈ దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండేవారన్నారు. కాశ్మీర్‌లో భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ అనుమతించలేదు.. ఆర్టికల్ 370 గోడలా కూర్చుంది. సర్దార్ పటేల్ భూమి నుంచి వచ్చిన నేను.. ఆర్టికల్ 370ని రద్దు చేశానని చెప్పుకొచ్చారు. ఇక, కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి, భారత రాజ్యాంగాన్ని అమలు చేశాను అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

Read Also: CSK vs PBKS: వికెట్లు తీయాలనే లక్ష్యంతో బరిలోకి దిగను: హర్‌ప్రీత్

కాగా, ఒకప్పుడు ఉగ్రవాదులను ఎగుమతి చేసిన దేశం (పాకిస్థాన్) ఇప్పుడు పిండిని దిగుమతి చేసుకోవడానికి ఇంటింటికీ తిరుగుతోందన్నారు. అలాగే, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని టార్గెట్‌ చేసిన ప్రధాని.. నేడు భారతదేశంలో కాంగ్రెస్‌ బలహీనపడుతోందన్నారు. తమాషా ఏమిటంటే ఇక్కడ కాంగ్రెస్‌ చచ్చిపోతోందని.. అక్కడ పాకిస్థాన్‌ ఏడుస్తోంది.. ఇప్పుడు పాక్‌ నేతలు కాంగ్రెస్‌ కోసం ప్రార్థించాలి అని ఆయన చెప్పుకొచ్చారు. యువరాజు (రాహుల్ గాంధీ)ను ప్రధానమంత్రిని చేసేందుకు పాక్ ఉవ్విళ్లూరుతోంది.. పాకిస్థాన్‌కు కాంగ్రెస్‌కు మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం ఇప్పుడు పూర్తిగా బట్టబయలైంది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు.