Pakistan: పాకిస్థాన్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనాలు అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, మంత్రులు, సమాఖ్య కార్యదర్శులు, పార్లమెంటేరియన్ల కంటే ఎక్కువగా ఉన్నాయని పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సమర్పించిన డేటా ప్రకారం ది న్యూస్ ఇంటర్నేషనల్ నివేదించింది. జీతం పొందడంలో పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి మొదటి స్థానంలో ఉండగా.. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు రెండవ స్థానంలో ఉన్నారు. అధ్యక్షుడు మూడో స్థానంలో ఉన్నారు. ప్రధానమంత్రి మంత్రులు, సమాఖ్య కార్యదర్శుల కంటే తక్కువ జీతం పొందుతారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో ఛైర్మన్ నూర్ ఖాన్, పాకిస్తాన్ అధ్యక్షుడి జీతం పాకిస్తానీ రూపాయిలు.8,96,550 గా ఉంది. ప్రధానమంత్రి రూ.201,574 జీతం పొందుతారని సభ్యులకు తెలియజేశారు. అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి రూ.15,27,399 అందుకుంటారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల జీతం రూ. 14,70,711, ఫెడరల్ మంత్రులు రూ.3,38,125 పొందుతారు.ఒక పార్లమెంటేరియన్ రూ.188,000 జీతం పొందుతుండగా.. గ్రేడ్-22 అధికారి రూ.591,475 అందుకుంటారు. పాకిస్తాన్ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ద్వారా పొందిన ప్రోత్సాహకాలు, అధికారాలకు సంబంధించిన వివరాలను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కోరింది.
Read Also: BJP MP Passes Away: అనారోగ్యంతో బీజేపీ ఎంపీ కన్నుమూత
పాకిస్తాన్ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ మంగళవారం నాడు అత్యున్నత న్యాయస్థానం 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఖర్చుల ఆడిట్ కోసం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు హాజరు కాలేదు. వచ్చే మంగళవారం జరగనున్న సమావేశానికి ఆయనను కమిటీ మళ్లీ పిలిపించి, హాజరుకాకపోతే వారెంట్లు జారీ చేస్తామని హెచ్చరించింది. రిజిస్ట్రార్ లేకపోవడంపై కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. “పాకిస్తాన్ సుప్రీం కోర్టు ప్రిన్సిపల్ అకౌంటింగ్ ఆఫీసర్ పీఏసీ ముందు హాజరుకాకపోతే, మిగిలిన సంస్థలు ఎందుకు జవాబుదారీగా ఉంటాయి” అని నూర్ ఖాన్ అన్నారు. ఎస్సీ అకౌంట్ల ఆడిట్ వ్యవహారం విచారణలో ఉందని, పీఏసీ పరిధిలోకి రాదని, కమిటీ ముందు హాజరు కావాల్సిన అవసరం లేదని రిజిస్ట్రార్ లేఖ రాశారని చెప్పారు.