Diapers on Buffaloes: పిల్లలకే కాదు.. బర్రెలకు కూడా డైపర్స్.. ఎక్కడంటే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా మనం చిన్న పిల్లలు ఇల్లు అపరిశుభ్రం చేయకుండా ఉండటానికో లేదా ప్రయాణాల్లో ఇబ్బంది కలగకుండా ఉండటానికో డైపర్లు వాడుతుంటాం. ఇది సాధారణంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఉండేది. కానీ, పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అక్కడ పసిపిల్లలతో పాటు.. భారీ కాయం ఉన్న బర్రెలకు, ఆవులకు డైపర్లు కడుతున్నారు. వినడానికి నవ్వులాటగా అనిపించినా… అక్కడి పశువుల యజమానులు పడుతున్న తిప్పలు చూస్తుంటే ఇది నిజంగానే ఒక వింత పరిస్థితి అంటారు. పారిశుధ్యం పేరుతో ప్రభుత్వం తీసుకున్న ఒక కఠిన నిర్ణయం, ఇప్పుడు పశువుల యజమానులను ఈ వినూత్న మార్గంలో ఆలోచించేలా చేసింది.
అసలేం జరిగింది..?
పాకిస్థాన్ పంజాబ్ ప్రభుత్వం నగరాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి “ముఖ్యమంత్రి క్లీన్ పంజాబ్” అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా రోడ్లు, బహిరంగ ప్రదేశాలు మురికిగా మారకుండా ఉండటానికి కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది. ముఖ్యంగా పశువుల పేడ వల్ల రోడ్లు పాడవుతున్నాయని, దుర్వాసన వస్తోందని ప్రభుత్వం భావించింది. అందుకే.. ఎవరైనా తమ పశువులను రోడ్లపైకి తెచ్చి, అవి అక్కడ పేడ వేస్తే భారీగా జరిమానాలు విధిస్తామని ప్రకటించింది.
Also Read
- MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Also Read:Star Hero : స్టార్ హీరో స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్
భారీ జరిమానాలు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో పేడ వేసి అపరిశుభ్రం చేస్తే దాదాపు రూ. 30,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సామాన్య పశువుల యజమానులకు ఇది చాలా పెద్ద మొత్తం. ఈ భారీ జరిమానాల నుంచి తప్పించుకోవడానికి వారు ఒక వింత ఉపాయాన్ని కనిపెట్టారు.
పెద్ద పెద్ద గోనె సంచులు లేదా మందపాటి క్లాత్ బ్యాగులను పశువుల వెనుక భాగంలో కడుతున్నారు. పశువులు పేడ వేసినప్పుడు అది నేరుగా రోడ్డు మీద పడకుండా ఆ సంచిలోనే పడిపోతుంది. దీనివల్ల రోడ్లు శుభ్రంగా ఉంటున్నాయి.. యజమానులు జరిమానా భయం లేకుండా పశువులను రోడ్లపై తీసుకెళ్లగలుగుతున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. గేదెలు భారీ సంచులను తగిలించుకుని రోడ్లపై నడుస్తుంటే చూసేవారికి నవ్వు తెప్పిస్తోంది. అయితే.. పారిశుధ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న పట్టుదలను కొందరు మెచ్చుకుంటుంటే, పశువుల మీద ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల వాటికి ఇబ్బంది కలుగుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా.. “అవసరం అన్ని పనులూ నేర్పిస్తుంది” అన్నట్లుగా.. జరిమానా భయం పాకిస్థాన్ పంజాబ్ రైతులతో ఈ వింత పని చేయిస్తోంది.
తాజావార్తలు
-
Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
-
Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
-
MLA Bonda Uma: సిద్ధార్థకు అవకాశం ఇవ్వండి.. సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే బోండా ప్రత్యేక విజ్ఞప్తి!
-
Irumudi 2: రామ్ చరణ్‌తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
-
UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!