Irumudi 2: రామ్ చరణ్‌తో ‘ఇరుముడి 2’?.. అసలు విషయం చెప్పేసిన శివ నిర్వాణ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Irumudi 2: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి హిట్ టాక్ అందుకుని థియేటర్లలో దూసుకెళ్తోంది. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన ‘ఇరుముడి’ సినిమా కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సందర్భంలో మైత్రీ మూవీ మేకర్స్ రీసెంట్ గా సక్సెస్ మీట్‌ను కూడా నిర్వహించారు. అయితే ఈ సమయంలో ‘ఇరుముడి 2’పై కూడా ప్రత్యేక చర్చ మొదలైంది. అయితే ఈ సీక్వెల్లో రామ్ చరణ్ నటిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ పెరిగింది. మరి నిజంగానే ‘ఇరుముడి 2’ ఆలోచన ఉందా? రామ్ చరణ్‌ను శివ నిర్వాణ తీసుకురావాలనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు దర్శకుడే స్వయంగా సమాధానం ఇచ్చారు.
‘ఇరుముడి’ ఘన విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో శివ నిర్వాణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు ‘ఇరుముడి’కి సీక్వెల్ చేసే ఆలోచన ఉందా, ఒకవేళ చేస్తే రామ్ చరణ్‌ను తీసుకుంటారా అనే ప్రశ్నను ఆయన ముందుంచారు. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో కలిసి పనిచేసే అవకాశం వస్తే అది తనకు ఎంతో సంతోషకరమైన విషయమేనని దర్శకుడు అంగీకరించారు. అయితే అక్కడితో రామ్ చరణ్ ‘ఇరుముడి 2’లో నటిస్తున్నారని మాత్రం ఆయన చెప్పలేదు. పైగా ప్రస్తుతం అసలు సీక్వెల్ ప్లాన్ కూడా లేదని స్పష్టం చేశారు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
రామ్ చరణ్ పేరు ‘ఇరుముడి’తో ఎలా లింక్ అయిందన్న దానిపై కూడా శివ నిర్వాణ స్పందించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఈ సినిమాలో కనిపిస్తారనే ప్రచారం మొదలైందని ఆయన తెలిపారు. మొదట్లో దాన్ని సోషల్ మీడియా స్పెక్యులేషన్‌గానే భావించి పెద్దగా పట్టించుకోలేదట. అయితే కొంతకాలం తర్వాత జర్నలిస్టులు అదే విషయాన్ని పదేపదే అడగడం ప్రారంభించడంతో ప్రేక్షకులు తప్పుగా అర్థం చేసుకోకుండా అసలు విషయం చెప్పాల్సి వచ్చిందని వివరించారు. రామ్ చరణ్ ‘ఇరుముడి’లో భాగం కాదని అప్పుడే క్లారిటీ ఇచ్చినట్లు వెల్లడించారు. రామ్ చరణ్ టీమ్ కూడా ఆయన సినిమాలో లేరని గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమిటంటే, రామ్ చరణ్‌తో కలిసి పనిచేయాలనే ఆలోచనను శివ నిర్వాణ పూర్తిగా కొట్టిపారేయలేదు. అలాంటి అవకాశం వస్తే తప్పకుండా సంతోషిస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఇరుముడి’కి ప్రస్తుతం సీక్వెల్ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే ‘ఇరుముడి 2’పై ఇప్పట్లో ఎలాంటి ప్లాన్ లేదు. రామ్ చరణ్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఉన్నారనే వార్తకు ఆధారం లేదు. అందుకే ప్రస్తుతం ‘ఇరుముడి 2’ కంటే ‘ఇరుముడి’ సక్సెస్‌ను ఎంజాయ్ చేయడంపైనే దర్శకుడు ఫోకస్ పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఇక ‘ఇరుముడి’ తరువాత ఆయన తదుపరి చిత్రం తమిళ స్టార్ హీరో ధనుష్‌తో లేదా సూర్యతో ఉండబోతోందంటూ ఫిలిం నగర్ వర్గాల్లో, సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోనే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!