Pakistan: దేశ ప్రథమ మహిళగా అధ్యక్షుడి కుమార్తె..! కారణమిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ కొత్త ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రథమ మహిళగా కొత్త అధ్యక్షుడు జర్దారీ కుమార్తెను అధికారికంగా గుర్తించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇటీవలే పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ రెండోసారి దేశాధినేత పగ్గాలు చేపట్టారు. 14వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఈ క్రమంలోనే దేశ ప్రథమ మహిళగా తన కుమార్తె 31 ఏళ్ల ఆసిఫా భుట్టోను అధికారికంగా గుర్తిస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పాక్ మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి.
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
వాస్తవానికి దేశాధ్యక్షుడి సతీమణికి మాత్రమే ప్రథమ మహిళ హోదా ఉంటుంది. కానీ జర్దారీ సతీమణి, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో 2007లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన మరో వివాహం చేసుకోలేదు. 2008-13 మధ్య తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సయమంలో ప్రథమ మహిళ హోదాను ఖాళీగా ఉంచారు. కానీ ఈసారి మాత్రం ఆ హోదాలో చిన్న కుమార్తె ఆసిఫాకు ఇవ్వాలని జర్దారీ నిర్ణయించినట్లు సదరు కథనాలు చెప్పుకొచ్చాయి.
ఈ విషయంపై అధ్యక్షుడి పెద్ద కుమార్తె భక్తావర్ భుట్టో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ట్వీట్ బలం చేకూరుస్తున్నాయి. కోర్టు విచారణలు, న్యాయపోరాటం దగ్గర నుంచి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకు జర్దారీకి అన్ని వేళలా మా పాక్ ప్రథమ మహిళ ఆసిఫా వెన్నంటే నిలిచిందని ఆమె పోస్ట్ చేశారు. దీంతో పాక్ ప్రథమ మహిళగా ఆసిఫా భుట్టో ప్రకటన ఖాయమనే తెలుస్తోంది.
ఇదిలా ఉంటే 2020లో ఆసిఫా తొలిసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి పీపీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. జర్దారీ ప్రమాణస్వీకార కార్యక్రమానికీ కూడా ఆమె హాజరయ్యారు.
ఈ సంస్కృతి ఆయా దేశాల్లో కొనసాగుతోంది. అధ్యక్షుడి జీవిత భాగస్వామి చనిపోతే.. ఆ స్థానంలో కుమార్తెలు, సోదరీమణులు, లేదా మేనకోడళ్లను పెట్టుకునే విధానం కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. అమెరికాలో ఈ పద్ధతి ఎప్పుట్నుంచో కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా పాక్ అధ్యక్షుడు జర్దారీ ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!