Site icon NTV Telugu

Pakistan vs Russia: భారత్ పర్యటన ఎఫెక్ట్.. పాకిస్థాన్ ప్రధానిని ఘోరంగా అవమానించి పుతిన్.. ఇది రెండోసారి!

Pak

Pak

Pakistan vs Russia: పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షహబాజ్‌ షరీఫ్‌ మరోసారి అంతర్జాతీయ వేదికపై ఘోర అవమానకర పరిస్థితులని ఎదుర్కొన్నారు. టర్క్‌మెనిస్తాన్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ఫోరం ఆన్‌ పీస్‌ అండ్‌ ట్రస్ట్‌ సమావేశాలకు హాజరైన షహబాజ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ జరగాల్సి ఉండగా.. ఆ సమయంలో పుతిన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో ఉన్నారు. సుమారు 40 నిమిషాలు వేచి చూసినా కూడా పుతిన్ రాకపోవడంతో.. సహనం కోల్పోయిన షహబాజ్ షరీఫ్.. పుతిన్, ఎర్డోగాన్ మధ్య జరుగుతున్న మీటింగ్ హాల్ డోర్లు నెట్టేసి వెళ్లాడు. ఆ సమయంలో షరీఫ్ పూర్తిగా అసహనంతో ఉన్నాడని నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలను చూస్తే తెలుస్తోంది. డోర్ వద్ద ఉన్న సెక్యూరిటీ ఆపేందుకు ప్రయత్నించినా కూడా పట్టించుకోకుండా షరీఫ్ లోపలికి వెళ్లాడు. సుమారు 10 నిమిషాల తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత పుతిన్ పాక్ ప్రధాని మధ్య సమావేశం జరిగింది.

Read Also: Mowgli Review: మౌగ్లీ రివ్యూ..యాంకర్ సుమ కొడుకు హిట్ కొట్టాడా?

షహబాజ్‌కి ఇది రెండోసారి..
అయితే, ఇది షహబాజ్‌ను పుతిన్ అవమానించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో కూడా ఆయన ఇలాగే అవమాన పడ్డారు. ఆ సందర్భంగా పుతిన్‌, భారత ప్రధాని నరేంద్ర మోడీ పరస్పరం మాట్లాడుకుంటూ షహబాజ్‌ ముందు నుంచే వెళ్లిపోయారు. అప్పట్లో పుతిన్‌- షహబాజ్‌ని కనీసం పట్టించుకోకపోవడం, పాక్ ప్రధాని కరచలనం చేసేందుకు వెళ్లిన నిరాకరించిన దృశ్యాలు కెమెరాల్లో చిక్కాయి.

Read Also: Jagtial District: తమ్ముడు ఎన్నికల్లో ఓటమి.. గుండెపోటుతో అక్క మృతి..

భారత్‌కు భిన్నంగా స్వాగతం
ఇక, ఇటీవలే పుతిన్‌ రెండు రోజుల భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి పుతిన్‌కు ఘన స్వాగతం పలికారు. ఇద్దరూ ఒకే వాహనంలో ప్రధాని నివాసానికి వెళ్లడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే, సెంట్రల్‌ ఆసియాలో కీలక దేశమైన టర్క్‌మెనిస్తాన్‌లో శాంతి, విశ్వాసాలపై అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు పుతిన్‌ అష్గాబాత్‌కు చేరుకున్నారు. ఈ పర్యటన రష్యాకు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం కలిగినదిగా విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, ఈ వేదికపై పాకిస్థాన్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌కు ఎదురైన అవమానకర పరిస్థితులు.. అంతర్జాతీయ దౌత్యరంగంలో పాక్‌ ప్రతిష్ఠపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

Exit mobile version