Site icon NTV Telugu

Asia Cup 2023: నేపాల్‌తో మ్యాచ్.. పాకిస్తాన్‌ తుది జట్టు ఇదే! డబుల్‌ సెంచరీ ప్లేయర్ ఆయేగా

Pakistan Odi Team

Pakistan Odi Team

Pakistan Playing XI Against Nepal for Asia Cup 2023: క్రికెట్‌ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూసిన ఆసియా కప్ 2023 నేటి నుంచి మొదలుకానుంది. మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ బుధవారం ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌, నేపాల్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పటిష్ట పాక్ విజయాన్ని ఆపడం పసికూన నేపాల్‌కు కష్టమనే చెప్పాలి. ఏదైనా సంచలనం జరిగితే తప్ప పాక్ విజయం ఖాయమే. ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 3.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

నేపాల్‌తో మ్యాచ్‌కు తమ తుది జట్టుని పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. ఈ జట్టులో శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో డబుల్‌ సెంచరీ చేసిన యువ ఆటగాడు సల్మాన్ అలీ అగాకు చోటు దక్కింది. ఇప్పటివరకు అగా పాక్ తరఫున 9 టెస్టులు, 14 వన్డేలు ఆడాడు. వన్డేల్లో ఇప్పటివరకు సెంచరీ చేయని అగా.. ప్రస్తుత ఫామ్ చూస్తే ఆ లోటు తీర్చుకోనున్నాడు.

స్పెషలిస్టు బ్యాటర్ల కోటాలో బాబర్‌ ఆజమ్, ఫఖార్‌ జమాన్‌, ఇమామ్ ఉల్ హక్, ఇఫ్తికర్ అహ్మద్‌లకు చోటు దక్కింది. కెట్‌ కీపర్‌గా డెంజరస్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. పేసర్లు షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్‌లను తట్టుకుని నిలబడడం నేపాల్‌ బ్యాటర్లకు కష్టమే. పాక్ ఈ మ్యాచ్‌ అనంతరం సెప్టెంబర్‌ 2న చిరకాల ప్రత్యర్థి భారత్‌తో ఢీ కొననుంది.

Also Read:

పాకిస్తాన్‌ తుది జట్టు:
బాబర్ ఆజం (కెప్టెన్‌), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌ కీపర్‌), షాదాబ్ ఖాన్ (వైస్‌ కెప్టెన్‌), మహ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహీన్ అఫ్రిది ,హరీస్ రవూఫ్.

Exit mobile version