NTV Telugu Site icon

Joe Biden: పాకిస్తాన్‌.. అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటి

Joe Biden

Joe Biden

Joe Biden: ఏ విధమైన సమన్వయం లేకుండా అణ్వాయుధాలను కలిగి ఉన్న పాకిస్తాన్‌ను ప్రపంచంలోని ‘అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటి’గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభివర్ణించారు. లాస్ ఏంజిల్స్ (కాలిఫోర్నియా)లో జరిగిన డెమొక్రాటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ రిసెప్షన్‌లో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చైనా, రష్యాలను దూషించారు. చైనా, రష్యాకు సంబంధించి అమెరికా విదేశాంగ విధానం గురించి బైడెన్‌ మాట్లాడుతుండగా పాకిస్తాన్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా తాను భావిస్తున్నట్లు బైడెన్ చెప్పారు.

Former Chief Justice: మాజీ చీఫ్‌ జస్టిస్‌ను మసీదు బయటే కాల్చిచంపేశారు..

బైడెన్ వ్యాఖ్యలు అమెరికాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఎదురుదెబ్బగా భావించవచ్చు. ఈ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ 21వ శతాబ్దం రెండవ త్రైమాసికంలో డైనమిక్‌ను మార్చడానికి యూఎస్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. యూఎస్ జాతీయ భద్రతా వ్యూహం విడుదలైన రెండు రోజుల తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సంవత్సరం ప్రారంభంలో “నో-లిమిట్స్ పార్టనర్‌షిప్” ప్రకటించిన చైనా, రష్యాలు ఒకదానికొకటి ఎక్కువగా కలిసిపోతున్నాయని, అయితే అవి విసిరే సవాళ్లు విభిన్నంగా ఉన్నాయని జాతీయ భద్రతా వ్యూహం పేర్కొంది. వచ్చే పదేళ్లు చైనాతో పోటీ నిర్ణయాత్మక దశాబ్దం కానుందని అమెరికా భద్రతా వ్యూహం హైలైట్ చేసింది.