Pakistan Occupied Kashmir: ఢిల్లీ యూనివర్శిటీలోని గార్గి కాలేజీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) విషయంలో తమ ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. పీఓకేను తిరిగి భారత్‌కు తీసుకురావడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు పూర్తిగా భిన్నమైన నమ్మకాలు ఉండగా.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని మోడీ ప్రభుత్వం ఎలా రద్దు చేసిందో చెప్పారు. ఇక, పీఓకేలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై రాజకీయ, మానవ హక్కుల సంస్థలు లాంగ్ మార్చ్ చేశాయని జైశంకర్ అన్నారు.
Read Also: Rajasthan : జలజీవన్ మిషన్ లో వెలుగు చూసిన 500 కోట్ల కుంభకోణం.. ఎఫ్‌ఐఆర్ నమోదు
అలాగే, పీఓకికి సంబంధించి పార్లమెంటులో ఒక తీర్మానం చేయడం ద్వారా దానికి దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ మద్దతు తెలిపిందని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. దీని వల్ల మన దేశంలో అంతర్భాగమైన PoKని భారతదేశానికి తిరిగి తీసుకోచ్చేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. POK భారతదేశం నుంచి ఎప్పటికీ బయటకు వెళ్లదని ఆయన తెలిపారు. పీఓకే ఈ దేశం వెలుపల ఎన్నడూ లేదని, పీఓకే పూర్తిగా భారత్‌లో భాగమని ఇప్పటికే పార్లమెంట్ లో తీర్మానం చేసిందన్నారు.
Read Also: Kishan Reddy: సికింద్రాబాద్, అంబర్ పేట లో కిషన్ రెడ్డి పర్యటన.. షెడ్యూల్ ఇదీ..
కాగా, అలాగే, మే 11న పాక్ ఆక్రమిత కశ్మీర్ లో తీవ్రమైన నిరుద్యోగం, గోధుమలు, పిండిపై సబ్సిడీని రద్దు చేయడం వంటి ఇతర సమస్యలను లేవనెత్తుతామని యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ (యూకేపీఎన్‌పీ), జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ముజఫరాబాద్‌లో నిరసన చేసేందుకు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.
