Site icon NTV Telugu

Bangladesh: అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ! 1971 యుద్ధం తర్వాత తొలిసారి బంగ్లాకు పాక్ యుద్ధనౌక..

Pak

Pak

Pakistan Navy Warship PNS Saif Visits Bangladesh: గత కొన్ని నెలలుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు జోరందుకున్నాయి. పాకిస్థాన్ సైనిక అధికారులు బంగ్లాదేశ్‌ను సందర్శిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ నేవీ యుద్ధనౌక చిట్టగాంగ్ ఓడరేవుకు చేరుకుంది. పాకిస్థాన్ నేవీ యుద్ధనౌక, PNF SAIF, నాలుగు రోజుల సౌహార్ద పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ఓడరేవుకు చేరుకుందని బంగ్లా నేవీ సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రకటించింది. బంగ్లాదేశ్ నేవీ పాక్‌ యుద్ధనౌకకు హృదయపూర్వక స్వాగతం పలికింది.

READ MORE: Violence In Court: కోర్టు ఆవరణలోనే లాయర్పై హత్యాయత్నం.. ఉద్రిక్తంగా మారిన విడాకుల కేసు!

నిజానికి.. కెప్టెన్ షుజాత్ అబ్బాస్ రాజా నేతృత్వంలోని జుల్ఫికార్-క్లాస్ ఫ్రిగేట్ పిఎన్ఎస్ సైఫ్ (FFG-253) సద్భావన పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ పోర్టుకు చేరుకుంది . పాకిస్థాన్ నేవీ చీఫ్ అడ్మిరల్ నవీన్ అష్రఫ్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి అధికారిక పర్యటన నిమిత్తం బంగ్లాదేశ్‌లో ఉన్న సమయంలో ఈ సందర్శన జరిగింది. 1971 తర్వాత పాకిస్థాన్ యుద్ధనౌక బంగ్లాదేశ్‌ను సందర్శించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. నిజానికి, భారత్ నుంచి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత, పాకిస్థాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ద్వారా మన దేశాన్ని చుట్టుముట్టాలని కుట్ర పన్నుతోందనే వార్తలు వ్యాపిస్తున్నాయి. మరోవైపు.. గత నెల ప్రారంభంలో పాకిస్థాన్ సైన్యంలో రెండవ అత్యున్నత సైనిక కమాండర్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా కూడా బంగ్లాదేశ్‌ను సందర్శించారు. మీర్జా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్, ఆర్మీ చీఫ్‌తో సమావేశమయ్యారు.

READ MORE: Jubilee Hills Bypoll: నేటితో ప్రచారానికి తెర.. సాయంత్రం నుంచి ఆంక్షలు, వైన్స్ బంద్!

Exit mobile version