Violence In Court: కోర్టు ఆవరణలోనే లాయర్పై హత్యాయత్నం.. ఉద్రిక్తంగా మారిన విడాకుల కేసు!
- తిరుపతి జిల్లా పుత్తూరులో విడాకుల కేసు వివాదం..
- న్యాయవాదిపైకి కారు ఎక్కించేందుకు ట్రై చేసిన వ్యక్తి..
- నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Violence In Court: తిరుపతి జిల్లా పుత్తూరులో విడాకుల కేసు వివాదం హత్యాయత్నం స్థాయికి చేరింది. కోర్టు పరిధిలో న్యాయవాదిపై కారు దూసుకెళ్లిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, తిరుపతి పట్టణంలోని భవాని నగర్‌కు చెందిన ఏ. రాజశేఖర్ అనే లాయర్ ఫిర్యాదుతో రామచంద్రాపురం మండలం నదవలూరు గ్రామానికి చెందిన సాయి ప్రసాద్ రెడ్డిపై పుత్తూరు పోలీసులు కేసు ఫైల్ చేశారు. సాయి ప్రసాద్ తన భార్య హేమలతతో పరస్పర ఒప్పందం ప్రకారం విడాకుల కోసం పుత్తూరు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
Read Also: Deputy CM Pawan: నేడు పలమనేరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..
Also Read
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
- Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
- President Droupadi Murmu: లఖ్పతి దీదీలు కాదు.. కరోడ్‌పతి దీదీలుగా ఎదగాలి.. రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
అయితే, ఫిర్యాదులో హేమలత తరఫున న్యాయవాదిగా వ్యవహరిస్తున్న రాజశేఖర్ గత నాలుగు నెలలుగా కేసు పరిష్కారం కాకుండా ఆలస్యం చేస్తున్నారని సాయి ప్రసాద్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో, నిన్న పుత్తూరు కోర్టు పరిధిలో లాయర్ రాజశేఖర్‌పైకి తన కారును ఉద్దేశపూర్వకంగా దూసుకెళ్లి చంపడానికి ప్రయత్నించాడు. అదృష్టవశాత్తూ అతడు తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఇక, ఈ ఘటనపై పుత్తూరు పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ కావడంతో.. భారత న్యాయ సవరణ చట్టంలోని 109(1), 351(2) సెక్షన్ల కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడు సాయి ప్రసాద్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
తాజావార్తలు
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
-
Isha Ambani: జియో పుట్టుక వెనుక అసలు కథ.. ఈషా అంబానీ చెప్పిన సీక్రెట్ స్టోరీ!
-
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
ట్రెండింగ్
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!