Site icon NTV Telugu

Operation Sindoor: ఏడవడం ఒక్కటే తక్కువ.. పాకిస్తాన్ పార్లమెంటులో ఎమోషనలైన ఎంపీ.. వీడియో వైరల్!

Pakistani Mp

Pakistani Mp

Operation Sindoor: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) ప్రాంతం సహా పాకిస్తాన్ లోని అనేక ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం ఎయిర్‌ స్ట్రైక్స్ నిర్వహించిన తర్వాత పాకిస్తాన్ లో తీవ్ర భయ వాతావరణం నెలకొంది. భారత్ మరొ దాడికి దిగవచ్చన్న ఆందోళనతో పాకిస్తాన్ అంతటా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అయితే తాజాగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో PMLN (పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్) ఎంపీ తాహిర్ ఇక్బాల్ కంటతడి పెట్టారు. ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పార్టీకి చెందిన ఆయన “అల్లాహ్ మన హిఫాజత్ చేయాలి” అంటూ పార్లమెంట్‌లో భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది.

Read Also: Operation Sindoor: “అంతా సిద్ధం” ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం..

భారత వైమానిక దాడుల అనంతరం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సహా చాలామంది కీలక నాయకులు భయంతో ఉన్నారు. మే 7, 2025న భారత వైమానిక దళం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో అనేక ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలు నేలమట్టం అయ్యాయి. ఈ దాడుల తరువాత, పాకిస్తాన్ కూడా భారత్‌పై ప్రతీకార దాడికి యత్నించింది. ఇండియన్ ఆర్మీకి చెందిన అనేక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసేందుకు ప్రయత్నించినా అది విఫలమైంది. పాకిస్తాన్ మొత్తం 15 భారతీయ నగరాలను లక్ష్యంగా చేసేందుకు ప్రయత్నించినాట్లు అధికారులు తెలిపారు. ఇందులో 7 నగరాలు పంజాబ్‌కు చెందినవిగా గుర్తించబడ్డాయి. ఇక పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన కొన్ని మిస్సైళ్ళను భారతదేశం S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ సాయంతో ఆకాశంలోనే ధ్వంసం చేసింది. దీనితో పాకిస్తాన్‌కు మరో గట్టి దెబ్బ తగిలింది.

Exit mobile version