Viral Video: భారతదేశం బుధవారం చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర రోవర్‌ను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా అవతరించింది. ఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు. కానీ పాకిస్తాన్ నుండి ప్రతిస్పందనలు భిన్నంగా ఉన్నాయి. చంద్రయాన్-3 సాఫీగా ల్యాండింగ్ అయిన కొన్ని గంటల తర్వాత, భారత్‌తో తరచూ విభేదిస్తున్న పొరుగున ఉన్న పాకిస్థాన్‌లోని వివిధ వ్యక్తులు భారతదేశ అంతరిక్ష విజయంపై స్పందించారు. చంద్రయాన్ -3 ల్యాండింగ్‌పై ఒక పాకిస్తానీ యువకుడు హాస్యాస్పదంగా కామెంట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
Read Also: Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర-2 తేదీ ఖరారు.. గాంధీ పుట్టిన గడ్డ నుంచే..
‘అరే.. వాళ్లు డబ్బులు పెట్టి మరీ చంద్రుడి మీదికి వెళ్లుతున్నారు. కానీ, మనం ఆల్రెడీ చంద్రుడి మీదే ఉన్నాం కదా’ అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆ వ్యక్తి తెలిపాడు. అదేంటి.. మనం చంద్రుడిపై ఎలా ఉన్నాం. భూమి పైనే ఉన్నాం కదా? అని జర్నలిస్టు అడగగా.. దీనికి సదరు యువకుడు చంద్రుడికి, పాకిస్తాన్‌కు మధ్య పోలికలను పేర్కొన్నాడు. చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయా? అని అడగ్గా లేవని జర్నలిస్టు సమాధానం ఇచ్చాడు. పాకిస్తాన్‌లోనూ నీళ్లు లేవని యువకుడు అన్నాడు. చంద్రుడి మీద గ్యాస్ ఉన్నదా? లేదని చెప్పగా అంతే! పాకిస్తాన్‌లో కూడా లేదని చెప్పాడు. చంద్రుడి మీద కరెంట్ ఉన్నదా? అని అడగ్గా యూట్యూబర్ లేదని జవాబిచ్చాడు. పాకిస్తాన్‌లో కూడా లేదు.. ఇప్పుడు కరెంట్ లేదు కదా..అని ఆ యువకుడు అన్నాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Read Also: Road Accident: నేపాల్‌లో రోడ్ యాక్సిడెంట్.. ఆరుగురు భారతీయులతో సహా ఏడుగురి దుర్మరణం
ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రాజకీయ సంక్షోభంతో పాటు విదేశీ మారక నిల్వల కొరత కారణంగా పాకిస్థాన్ భారీ ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న తరుణంలో ఆ వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలు, ఆహారం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో ప్రజలు తమ జీవితాలను సాధారణంగా గడపడానికి, వారి ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడం కష్టంగా మారింది. ఆ వ్యక్తి వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. పాకిస్తాన్ అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పటికీ చాలా మంది వినియోగదారులు ఆ వ్యక్తి హాస్యాన్ని ప్రశంసించారు. కష్ట సమయాల్లో కూడా అత్యుత్తమ హాస్యాన్ని కలిగి ఉన్నందుకు పాకిస్థానీని మరొక నెటిజన్ ప్రశంసించారు.
చంద్రయాన్ 3 మిషయం విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ప్రశంసలు వస్తున్నాయి. దాయాది దేశం పాకిస్తాన్ నుంచి కూడా పొగడ్తలు వచ్చాయి. పాకిస్తాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను పాకిస్తాన్ మీడియా కూడా లైవ్‌లో చూపెట్టాలని కొన్ని నిమిషాల ముందు సూచించారు. భారత్‌పై ప్రశంసలు కురిపించారు. చంద్రయాన్-3 మిషన్ “మానవజాతికి చారిత్రాత్మక క్షణం” అని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రోను ఒకప్పుడు ఎగతాళి చేసిన పాక్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి.. ఇప్పుడు ప్రశంసించడం గమనార్హం.
Meanwhile, the Sense of Humor of Pakistani People are always top class. This on Chandrayaan pic.twitter.com/Y127YPeyIv
— Joy (@Joydas) August 23, 2023