NTV Telugu Site icon

Pakistan: పాకిస్తానీలను చంపింది ఇండియన్ ఏజెంట్లే.. భారత్‌పై పాక్ సంచలన ఆరోపణలు..

Pak India

Pak India

Pakistan: ఇటీవల కాలంలో పాకిస్తాన్‌లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఒక్కొక్కరిగా గుర్తుతెలియని వ్యక్తుల చంపుతున్నారు. అయితే ఈ హత్యల వెనక భారత్ ఉందని పాక్ ప్రభుత్వం అంతర్గతంగా అనుకుంటున్నప్పటికీ.. ఎప్పుడూ కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయలేదు. అయితే తొలిసారిగా పాక్ విదేశాంగ కార్యదర్శి సైరస్ సజ్జాద్ భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇద్దరు భారత ఏజెంట్లు యోగేష్ కుమార్, అశోక్ కుమార్ ఆనంద్‌లు పాకిస్తాన్ గడ్డపై ఇద్దరు పాకిస్తానీలను హత్యల్లో ప్రయేయం ఉందని ఆరోపించారు.

Read Also: Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల లోగో, ట్యాగ్‌లైన్‌ని ఆవిష్కరించిన ఎలక్షన్ కమిషన్

షాహీద్ లతీఫ్ అనే వ్యక్వని కనిపెట్టి హత్య చేసేందుకు యోగేష్ కుమార్ మహ్మద్ ఉమైర్ అనే వ్యక్తిని నియమించుకున్నాడని, స్థానిక నేరస్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లు సైరస్ ఆరోపించారు. ఈ హత్యయత్నం చాలా సార్లు విఫలమైన తర్వాత, ఉమైర్ స్వయంగా హత్యలు చేయాలని నిర్ణయించుకున్నాడని, అతను 5 మంది టార్గెట్ కిల్లర్లతో కలిసి టీమ్ ఏర్పాటు చేసుకున్నట్లు అతను వెల్లడించారు. గతేడాది అక్టోబర్ 11న షాహీద్ లతీఫ్‌ని రెండో ప్రయత్నంలో హత్య చేసినట్లు ఆరోపించారు. ప్రస్తుతం లతీఫ్ హత్యలో ప్రమేయం ఉన్న ఉమైర్, ఇతర వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు, వీరికి యోగేష్ కుమార్ అనే ఇండియన్ ఏజెంట్ మార్గనిర్దేశం చేసినట్లు విచారణలో తేలిందని పాక్ విదేశాంగ కార్యదర్శి తెలిపాడు.

మరో పాకిస్తానీ మహ్మద్ రియాజ్‌ని భారత ఏజెంట్ అశోక్ కుమార్ ఆనంద్ హత్య చేయించినట్లు సైరస్ ఖాజీ ఆరోపించాడు. గతేడాది సెప్టెంబర్ 8న మహ్మద్ రియాజ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో మహ్మద్ అబ్దుల్లా అలీ అనే వ్యక్తిని పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఇతడిని అశోక్ కుమార్ ఆనందర్, యోగేష్ కుమార్‌లు రిక్రూట్ చేసుకున్నట్లు తేలిందని పాక్ ఆరోపించింది. టెలిగ్రామ్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకుని, మధ్యవర్తుల ద్వారా హంతకులకు డబ్బులు ఇచ్చినట్లు విదేశాంగ కార్యదర్శి సైరస్ సజ్జాద్ ఆరోపించారు. గతేడాది ఈ హత్యలు సియాల్‌కోట్, రావల్‌కోట్‌లో జరిగాయి. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులకు జైష్-ఎ-మహ్మద్ మరియు లష్కరే తోయిబా ఉగ్రసంస్థలతో సంబంధాలు ఉన్నాయి.