NTV Telugu Site icon

T20 World Cup 2024: స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన భారత్.. టార్గెట్ ఎంతంటే..?

India

India

టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా.. భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. పాకిస్తాన్ బ్యాటింగ్‌లో నిధా దార్ ఒక్కరే ఒంటరి పోరాటం చేసింది. 34 బంతుల్లో ఒక ఫోర్ సాయంతో 28 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. పాక్ బ్యాటర్లలో మునీబా అలీ (17), సయేద అరూబ్ షా (14), ఫాతిమా సనా (13), సిద్రా అమీన్ (8) పరుగులు చేశారు. భారత్ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపించారు. దీంతో.. తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. భారత్ బౌలర్లలో అరుంధతీ రెడ్డి 3 వికెట్లతో చెలరేగింది. శ్రేయాంక పాటిల్ 2 వికెట్లు తీసింది. రేణుకా సింగ్, దీప్తి శర్మ, ఆశ శోభన తలో వికెట్ సంపాదించారు.