Site icon NTV Telugu

Kamran Ghulam: ఛీ.. ఛీ.. మరి ఇంత దిగజారాలా? బండ బూతులతో రెచ్చిపోయిన పాకిస్థాన్ క్రికెటర్

Kamran

Kamran

Kamran Ghulam: క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ జట్టు ప్రత్యేకమైన విధానం కలిగి ఉంటుందని అనడంలో ఎతువంటి అతిశయోక్తి లేదు. ఆటలోనే కాదు, ఆటగాళ్ల ప్రవర్తనలోనూ పాక్ జట్టు ఎప్పటికప్పుడు వివాదాల కేంద్రంగా నిలుస్తోంది. ప్రత్యర్థి జట్లతో స్లెడ్జింగ్ చేయడం, నోటిదూల ప్రదర్శించడం లాంటివి పాక్ ప్లేయర్లకు కొత్తేమీ కాదు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ కమ్రాన్ గులాం తన అసభ్య ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నేడు సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ సమయంలో పాక్ ఆటగాడు కమ్రాన్ గులాం తన నోటిదూలతో వివాదానికి దారి తీశాడు. సౌతాఫ్రికా స్టార్ బౌలర్ కగిసో రబాడా, యువ ఆటగాడు వెర్రీన్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. మొదట రబాడపై అసభ్య పదజాలం వాడినా.. రబాడ దానిని లైట్‌గా తీసుకున్నాడు. కానీ వెర్రీన్ మాత్రం ఈ వ్యవహారాన్ని అక్కడే వదిలిపెట్టలేదు.

Also Read: Veg vs Non veg: వెజ్ లేదా నాన్ వెజ్.. ఏ ఆహారం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందంటే?

https://twitter.com/MarkramBot/status/1872244694652211667

కమ్రాన్ గులాం అసభ్య పదజాలాన్ని వాడడంతో, వెర్రీన్ క్రమాన్‌ను ఎదిరించాడు. “దమ్ముంటే మళ్లీ ఆ మాట చెప్పు” అంటూ పాక్ బ్యాటర్‌ను సవాల్ చేశాడు. అయితే.. కమ్రాన్ మళ్లీ అదే అసభ్య పదజాలాన్ని వాడి, సౌతాఫ్రికా ఆటగాడి ఆగ్రహానికి గురయ్యాడు. ఈ ఘటన అనంతరం వెర్రీన్ అతనిపై ఫైర్ అయ్యాడు. చివరికి గులాం “వెళ్లు” అని అనగా, వెర్రీన్ కూడా ఏదో వ్యాఖ్య చేస్తూ తన ఫీల్డింగ్ పొజిషన్‌కు వెళ్లిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు పాక్ ఆటగాడి ప్రవర్తనపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ సంఘటన పాక్ క్రికెట్ జట్టు ప్రవర్తనపై మళ్లీ ప్రశ్నలు రేకెత్తించింది. ఆటలో మంచి ప్రదర్శన ఇవ్వడం పక్కనపెట్టి, ఇలాంటి వివాదాలకు కారణమవడం పాక్ క్రికెట్‌కు చెడ్డపేరు తెస్తోంది. క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తనపై కఠిన నియమాలు తీసుకురావాలని నెటిజన్లు కోరుతున్నారు. “క్రికెట్ అంటే జెంటిల్మన్ గేమ్ అని, కానీ పాక్ ఆటగాళ్లు ఈ ఆటకు అవమానం తెస్తున్నారు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version