NTV Telugu Site icon

Gas Cylinder: వామ్మో గ్యాస్ సిలిండర్ ధర రూ.3000 లా.. ఎక్కడంటే..?

Gas

Gas

దాయది దేశం పాకిస్థాన్‌లో కష్టాలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనపడటం లేదు.. పాక్ లో ఆర్థిక సంక్షోభం క్రమంగా పెరగడంతో సామాన్య ప్రజల వెన్ను విరుస్తుంది. సెప్టెంబరులో అంతర్జాతీయ ద్రవ్య నిధి ఒత్తిడితో ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచేసింది. $3 బిలియన్ల బెయిలవుట్ ప్యాకేజీని పొందడానికి పాక్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత, ద్రవ్యోల్బణం రేటులో భారీ పెరుగుదల కనిపించింది. సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం రేటు 31.44 శాతానికి మేర పెరిగింది.

Read Also: Asha Workers: కరీంనగర్ లో ఉద్రిక్తత.. మంత్రి గంగుల ఇంటి ముందు ఆశా వర్కర్ల ఆందోళన

జూలై నుంచి ప్రారంభమైన ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీని స్వీకరించేందుకు సెప్టెంబర్‌లో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ధరలను పెంచాలని పాకిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. దీని తర్వాత దేశంలో రవాణా ధరలు ఏడాదికి 31.26 శాతం పెరిగింది. అధికారిక గణాంకాల ప్రకారం.. ఆహార ద్రవ్యోల్బణం రేటు సంవత్సరానికి 33.11 శాతం మేర పెరిగింది. ఇల్లు, నీరు, విద్యుత్ ధరలు 29.70 శాతం మేర పెరుగాయి. ఇక, అక్టోబర్ 1న ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను పాకిస్థాన్ ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన ఆయిల్ అండ్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 246.16 మేర పెంచింది. దీంతో ఒక LPG సిలిండర్ 3079.64 రూపాయలకి పెరిగింది.

Read Also: Hyderabad Man Kills in London: లండన్‌లో హైదరాబాద్ వాసి దారుణ హత్య.. కూతురి పెళ్లి కోసం వస్తుండగా..!

ఇక, పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం.. ఈ ద్రవ్యోల్బణం బ్లూమ్‌బెర్గ్ డేటా 30.94 శాతం కంటే కొద్దీగా ఎక్కువగా ఉంటుంది. ఆగస్టులో పాక్ లో ద్రవ్యోల్బణం రేటు 27.40 శాతంగా ఉంది. అయితే, ఈ నెలలో కూడా ద్రవ్యోల్బణం రేటు పెరుగుదల నమోదు కావచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌, ఎల్‌పీజీ ధరలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. ఇక, అక్టోబర్ 30న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ మీటింగ్ జరుగనుంది. ఇందులో వడ్డీ రేట్లపై ప్రధానంగా సమీక్షిస్తారు.

Read Also: Ponguleti: కాంగ్రెస్ అంటేనే గ్రూపులు.. గ్రూపులు లేకుంటే అది కాంగ్రెస్ పార్టే కాదు

ఇలాంటి పరిస్థితిలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి బ్యాంక్ కొన్ని అవసరమైన చర్యలు తీసుకోనుంది. ఇంధన ధరల పెరుగుదల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం రేటు జూన్ 2024 వరకు పెరుగుతూనే ఉంటుంది అని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అంచనా. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం దేశ సగటు ధరల వృద్ధి రేటు 20 నుండి 22 శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేసింది.

Show comments