Site icon NTV Telugu

Pakistan: అంధకారంలో పాకిస్థాన్.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం

Pakistan

Pakistan

Pakistan: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌లో దయనీయ పరిస్థితులు నెలకొంటున్నాయి. పాకిస్థాన్‌లో మరోసారి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. గతేడాది అక్టోబర్‌లో కూడా విద్యుత్‌కు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు అంధకారంలోనే గడపాల్సి వచ్చింది. ప్రజలంతా అంధకారంలో గడపాల్సి రావడంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ గ్రిడ్‌లో వోల్టోజీలో హెచ్చుతగ్గుల కారణంగా పలు ప్రధాన నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

Egypt President: రిపబ్లిక్ డే ముఖ్య అతిథిగా భారత్‌కు విచ్చేసిన ఈజిప్ట్ ప్రెసిడెంట్

సోమవారం విద్యుత్ అంతరాయం కారణంగా ప్రజలకు తలెత్తిన అసౌకర్యానికి ప్రభుత్వం తరఫున ఆయన విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విద్యుత్ వైఫల్యానికి గల కారణాలపై విచారణ జరుగుతోందన్నారు.మరోవైపు, ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినప్పటికీ.. ఇంకా కొన్ని ప్రాంతాలు మాత్రం మంగళవారం కూడా అంధకారంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంతరాయానికి గల కారణాలను ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా గ్రిడ్‌ స్టేషన్లలో మంగళవారం విద్యుత్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని పాక్ ఇంధన మంత్రి వెల్లడించారు.

 

Exit mobile version