Petrol, Diesel Prices: ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మూడు రెట్లు పెంచుతూ సంచలన నిర్ణయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol, Diesel Prices: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న అంతరాయాల ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ప్రపంచ చమురు సరఫరాపై ఒత్తిడిని కొనసాగిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హై-ఆక్టేన్ ఇంధనం ధరను లీటరు ధరను ఏకంగా మూడు రెట్లు పెంచింది. ప్రస్తుతం అక్కడ లీటర్ హై-ఆక్టేన్ పెట్రోల్ ధర రూ. 321.17కు, డీజిల్ ధర రూ. 335.86కు చేరుకుంది. హై-ఆక్టేన్ ఇంధనం అంటే లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్‌ల వంటి అధిక-కంప్రెషన్ ఇంజిన్లలో వాడుతారు. ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం ఇంధన ధరలు, విస్తృత ఆర్థిక ఉపశమన చర్యలను సమీక్షించింది. లీటరుకు పీకేఆర్ 200 మేర పెంచిన ఈ భారీ పెంపు, సాధారణంగా విలాసవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై-ఆక్టేన్ ఇంధనాన్ని లక్ష్యంగా చేసుకుంది.
READ MORE: Unbroken IPL Records: 18 సీజన్ల తర్వాత కూడా చెక్కుచెదరకుండా.. ఐపీఎల్ తొలి సీజన్ రికార్డులు
Also Read
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే ఎంత ఇష్టమో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
“ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి నెలకు 9 బిలియన్ల రూపాయలు ఆదా అవుతాయి. ఈ ఆదా అయిన సొమ్ముతో ప్రజలకు ఉపశమనం లభిస్తుంది. ఈ భారం దేశంలోని అత్యంత సంపన్న వర్గం మాత్రమే భరిస్తుంది కాబట్టి, ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గిస్తుంది.” అని ప్రధాని షరీఫ్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ప్రజా రవాణా ఛార్జీలు లేదా విమాన ప్రయాణ ఖర్చులపై ప్రభావం పడదని, విస్తృత ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉన్నప్పటికీ సాధారణ ప్రజలకు కొంత ఊరట లభిస్తుందని షరీఫ్ పేర్కొన్నారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ ఘర్షణ కారణంగా ప్రపంచ చమురు ధరలు పెరగడంతో మార్చి 6న పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు పీకేఆర్ 55 మేర పెంచిన పాకిస్థాన్ తాజాగా మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే ఎంత ఇష్టమో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!