Aishwarya Rai: ఐశ్వర్య రాయ్‌ని నేను పెళ్లి చేసుకున్నంత మాత్రాన.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abdul Razzaq insults Aishwarya Rai: భారత్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నుంచి పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ లీగ్ స్టేజ్‌లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించడంతో పాక్ ఇంటిముఖం పట్టింది. భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి.. సెమీఫైనల్ చేరకుండానే వెనుదిరిగిన పాకిస్తాన్‌పై ఆ దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ఓటములను అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారానికి తేరలేపాయి.
అబ్దుల్ రజాక్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఖరిని తప్పుపడుతూ.. క్రికెట్‌తో ఏ సంబంధం లేని బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌ని మధ్యలోకి లాగాడు. పాక్ మాజీ క్రికెటర్లు షాహిది ఆఫ్రిది, ఉమర్ గిల్, అబ్దుల్ రజాక్ మధ్య తాజాగా మీడియా ఇంటరాక్షన్ జరగ్గా.. పాకిస్థాన్ జట్టు ఇటీవలి ప్రదర్శనల గురించి చర్చ మొదలైంది. ఈ చర్చలో భాగంగా అబ్దుల్ రజాక్ హద్దులు దాటాడు. ఐశ్వర్య రాయ్‌ను తాను పెళ్లి చేసుకుంటే.. అందమైన, పవిత్రమైన పిల్లలు పుడుతారనుకుంటే పొరబడినట్లే? అని రజాక్ పేర్కొన్నాడు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
‘అప్పటి కెప్టెన్ యూనిస్ ఖాన్ మెరుగైన ప్రదర్శన చేస్తాడని నాకు నమ్మకం ఉండేది. జట్టులోని ప్లేయర్స్ అందరం అదే అనుకున్నాం. ఇప్పుడు మాత్రం మంచి ఆటగాళ్లను తయారుచేయాలని కానీ, పాక్‌లో క్రికెట్‌ను మెరుగుపర్చాలని కానీ పాకిస్తాన్ బోర్డుకు లేదు. పాక్ బోర్డుకు సంకల్ప బలమే లేదు. అలాంటప్పుడు ఫలితాలు ఎలా వస్తాయి. నేను ఐశ్వర్య రాయ్‌ను పెళ్లి చేసుకోవడం వల్ల అందమైన, పవిత్రమైన పిల్లలు పుడతారని అనుకుంటే.. అది ఎప్పటికీ జరగదు. ఇదీ అంతే. బోర్డు సంకల్పం బలంగా ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతుంది’ అని అబ్దుల్ రజాక్ ఉదహరించాడు.
Also Read: World Cup 2023 Semi-Finals: సెమీస్ మ్యాచ్‌లపై వరుణుడి కన్ను.. వర్షం పడితే ఫలితం ఎలా నిర్ణయిస్తారు?
అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ షాహిది ఆఫ్రిది చప్పట్లు కొట్టాడు. రజాక్ వ్యాఖ్యలు సరైనవే అని అంగీకరించాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. రజాక్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. రజాక్ క్రికెట్ గురించి మాట్లాడకుండా.. మధ్యలో ఐశ్వర్య రాయ్‌ని ఎందుకు లాగాడు అని కామెంట్లు పెడుతున్నారు. రజాక్ రోజురోజుకు మరింతగా దిగజారిపోతున్నాడని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!