పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కాల్పుల విరమణ ఉల్లంఘనను వార్తలను ఖండించింది. పూర్తి నిజాయితీతో కాల్పుల విరమణను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అయితే.. భారతదేశం వైపు నుంచి ఉల్లంఘన సంఘటనలు జరిగాయని ఆరోపించింది. వాటిని పాకిస్థాన్ సైన్యం బాధ్యతాయుతంగా, సంయమనంతో నిర్వహించిందని పేర్కొంది. కాల్పుల విరమణ సజావుగా అమలు చేయడంలో ఏమైనా సమస్యలు తలెత్తే.. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొంది.
READ MORE: Cease Fire Violation : భారత్‌లోకి చొరబడేందుకు పాక్ యత్నం.. తిప్పికొట్టిన సైన్యం!
శనివారం భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ దానిని ఉల్లంఘించింది. రాత్రి 8 గంటల నుంచి జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్, పూంచ్, నౌషెరా, శ్రీనగర్, ఆర్‌ఎస్ పురా, సాంబా, ఉధంపూర్‌లలో పాకిస్థాన్ కాల్పులు జరిపింది. భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. “కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే పాక్ ఉల్లంఘించింది. ఇది అత్యంత దుర్మార్గం. ఇందుకు పూర్తి బాధ్యత ఆ దేశానిదే. దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. మతిలేని చర్యలను ఇకనైనా కట్టిపెట్టి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ పూర్తిస్థాయిలో కట్టుబడాలి. లేదంటే తీవ్రస్థాయిలో ప్రతిక్రియ తప్పదు. దాడులను దీటుగా తిప్పికొట్టాల్సిందిగా సైన్యానికి పూర్తిస్థాయి ఆదేశాలిచ్చాం.” అని విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టం చేశారు.
READ MORE: Virender Sehwag: ‘కుక్క తోకర వంకర’.. పాక్ దాడిపై సెహ్వాగ్ సంచలన ట్వీట్
