Khawaja Asif: తినడానికి తిండి లేదు కానీ.. కోల్‌కతాపై దాడి చేస్తారట! పాక్ రక్షణ మంత్రి “బలుపు” మాటలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khawaja Asif: పాకిస్థాన్ బలుపు మాటలు అస్సలు తగ్గడం లేదు. ఓ వైపు మధ్యప్రాచ్యంలో యుద్ధంతో దాయాది దేశం అతలాకుతలమవుతోంది. నిత్యవసర సరకులతోపాటు పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్నంటాయి. ద్రవ్యోల్బణం రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంత జరిగినా బలుపు మాత్రం తగ్గడం లేదు. అక్కడెక్కడో యుద్ధం జరిగితే తినడానికి సరిగ్గా తిండి దొరకక కొట్టుమిట్టాడుతున్న పాక్ భారత్‌పై దాడి చేస్తుందట. ఒకవేళ భారత్ పాకిస్థాన్ యుద్ధం వస్తే తాము కేవలం సరిహద్దులకే పరిమితం కామని.. ఏకంగా కోల్‌కతాను కూడా లక్ష్యంగా చేసుకుంటామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పిచ్చికూతలు కూశాడు. వాస్తవానికి, ఇటీవల భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిస్థితులను ఆసరాగా చేసుకుని పాక్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. భారత్ ఇచ్చే సమాధానం గతంలో కంటే చాలా డేంజర్‌గా ఉంటుందని వెల్లడించారు.
READ MORE: Rashmika Mandanna : రష్మిక బర్త్ డే స్పెషల్.. జయమ్మకు రణబాలి టీమ్ సర్ప్రైజ్ గిఫ్ట్
Also Read
- INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
- PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
ఉరి దాడుల తర్వాత చేసిన సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా అనంతరం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడులు, పహల్గామ్ ఘటన తర్వాత నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ వంటి పరాక్రమాలను గుర్తు చేశారు. ఈ వార్నింగ్‌తో పాకిస్థాన్ ఒక్కసారిగా బెంబేలెత్తింది. ఈ అంశంపై తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడి జరిగి ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో భారత్ పాక్‌ను బెదిరిస్తోందని ఆరోపించారు. భారత్ తమపై దాడి చేస్తూ తాము చూస్తూ ఊరుకోమన్నారు. తమ ప్రతిదాడులు భారత్ లోపలి వరకు వెళ్తాయని వెర్రి కూతలు కూశారు. జమ్ముకశ్మీర్, పంజాబ్‌లోనే కాదు. కోల్‌కతా వరకు దాడులు చేస్తామని, తమ వద్ద ఆ స్థాయి మిస్సైల్స్ ఉన్నాయన్నారు. భారత్ తమపై దాడులు చేసేందుకు ప్రస్తుతం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఇక పాకిస్థాన్ ఇంతలా రెచ్చిపోయి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఆ దేశం వద్ద ఉన్న 2750 కిలోమీటర్ల పరిధి గల అత్యంత సుదూర క్షిపణి షాహీన్-III అని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!