Site icon NTV Telugu

Operation Sindoor Effect: భారత్ దెబ్బకు అడుక్కుతినే పరిస్థితిలో పాకిస్తాన్..?!

Pak

Pak

Operation Sindoor Effect: భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” కారణంగా పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి దిగజారింది. ఈ దాడుల వల్ల పాకిస్తాన్ లో స్టాక్ మార్కెట్లు దారుణంగా కుప్పకూలాయి. దీనితో ఒక్కసారిగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల శాఖ తన అధికారిక X ఖాతా ద్వారా అంతర్జాతీయ భాగస్వాములకు అప్పుల కోసం విజ్ఞప్తి చేసింది. ఈ ట్వీట్‌లో.. ప్రతికూల శత్రు దాడుల వల్ల భారీ నష్టాలు ఎదుర్కొన్నాం. యుద్ధ పరిస్థితులు, స్టాక్ మార్కెట్ పతనం కారణంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం. దీని నుంచి బయటపడేందుకు మాకు మరిన్ని లోన్లు అవసరం. దయచేసి మాకు సహాయం చేయండి అని పేర్కొంది.

Read Also: India Pak War: మనం ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్నాం.. భారత రాయబారి వినయ్ క్వాత్ర

అయితే, ఈ ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం తమ X ఖాతా హ్యాక్ చేయబడిందని ప్రకటించింది. ఈ ప్రకటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే, పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుండి 1.3 బిలియన్ డాలర్ల రుణాన్ని కోరింది. ఈ రుణంపై IMF సమావేశం నేడు జరగనుంది. ఈ పరిణామాలు పాకిస్తాన్ ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దాడులు పాక్ ఆర్థిక వ్యవస్థను ఏ రేంజ్ లో కుదేలుచేశాయో అర్ధమవుతుంది. ఇప్పటికే IMF, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థల నుండి పాకిస్తాన్ అనేక రుణాలు తీసుకుంది. ఇప్పుడు మరిన్ని రుణాల కోసం విజ్ఞప్తి చేయడం ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత తీవ్రంగా దిగజారిందో అర్థమవుతుంది.

Exit mobile version