NTV Telugu Site icon

Gary Kirsten: మాట వినరు? మద్దతు తెలపరు.. పాకిస్థాన్‌ క్రికెట్ కోచ్ రాజీనామా

Gary Kirsten

Gary Kirsten

పాకిస్థాన్ క్రికెట్‌లో గందరగోళం నెలకొటోంది. ఇటీవల బాబ‌ర్ ఆజం వైట్‌బాల్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అంతే కాకుండా సెల‌క్షన్ క‌మిటీలో సైతం మార్పులు జరిగాయి. తాజాగా ఇప్పుడు 2011లో భారత్‌ను వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు. హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన 4 నెలల‌కే ఆయ‌న ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అతను కిర్‌స్టన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

READ MORE: Srinivas Goud : ఇప్పుడు ఓబీసీ కులగణన వీళ్లకు గుర్తుకు వచ్చింది

పాకిస్థాన్ టెస్ట్ జట్టు కోచ్ గిల్లెస్పీ, పీసీబీతో విభేదాల కారణంగా కిర్‌స్టెన్ తన పదవిని విడిచిపెట్టాడు. ఆస్ట్రేలియాలో పాకిస్థాన్ వన్డే సిరీస్ ప్రారంభానికి వారం రోజుల ముందు అతను ఆ పదవిని విడిచిపెట్టాడు. ఈ నిర్ణయం తీసుకోవడంపై చర్చనీయాంశమైంది. అతడి పదవీకాలం ఇంకా ఆరు నెలలు ఉన్నప్పటికీ.. గుడ్‌బై చెప్పాడు. ఈ నిర్ణయం తీసుకోవడంపై చర్చనీయాంశమైంది. అంతే కాకుండా ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా వెంటనే అంగీకరించింది. ప్రస్తుతం టెస్టులకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్న జాసన్ గిలెస్పీకే అదనంగా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

READ MORE:Perni Nani: సంపద సృష్టిస్తానని వేల కోట్లు అప్పులు.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

అయితే పాకిస్థాన్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్‌ కోచ్‌గా వచ్చినప్పటినుంచి తీవ్ర అసంతృప్తితోనే ఉన్నట్లు వార్తలు వ్యాపించాయి. బసిత్‌ అలీ వంటి మాజీ క్రికెటర్ కూడా గ్యారీ మరింతకాలం ఉండడని వ్యాఖ్యానించిన కొన్ని రోజుల్లోనే నిజమైంది. తాజాగా ఆసీస్‌, జింబాబ్వేతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ స్క్వాడ్‌లను పీసీబీ ప్రకటించింది. కెప్టెన్‌గా బాబర్ అజామ్‌ స్థానంలో మహమ్మద్‌ రిజ్వాన్‌ను ఎంపిక చేసింది. ఆ జట్లతో కిరిస్టెన్‌ వెళ్లే అవకాశాలు లేవు. గత కొన్నివారాలుగా కిరిస్టెన్‌కు, ఆటగాళ్లకు మధ్య తీవ్ర విభేదాలు వచ్చినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. పీసీబీ కూడా ఈ విషయంలో అతడికి మద్దతుగా నిలవకపోవడంతో జట్టును వీడినట్లు ప్రకటించాడు.