NTV Telugu Site icon

Pakistan Economic Crisis: ఎన్నికల తర్వాత పాకిస్థాన్ లో పెరిగిన ధరలు.. ప్రజలు ఆందోళన..!

Pakisthan

Pakisthan

పాకిస్థాన్ లో ధరల పెరుగుదల ప్రభావం దేశవ్యాప్తంగా కనబడుతుంది. ఆదివారం నాడు కరాచీలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ పలువురు ఆందోళనకు దిగారు. రోజు రోజుకు దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ తమను అప్పుల పాలు చేస్తు్ందని నిరసనకారులు వాపోయారు. ధరల పెరుగుదల పలు ఇబ్బందులను సృష్టిస్తున్నదని పాక్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం కూడా విఫలమవుతున్నట్లు కనపడుతుంది.. గ్యాస్ బిల్లులను ప్రజలు కట్టలేకపోతున్నారని పేర్కొన్నారు.

Read Also: Arvind Kejriwal: ఆరోసారి.. ఈడీ సమన్లకు హాజరుకాని కేజ్రీవాల్..

ఇక, గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలు తగ్గించడంతో ధరల నియంత్రణకు అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్ ధర రూ. 12,500 (పీకేఆర్‌)కు చేరడంతో ఈ మొత్తాన్ని వాయిదాల్లో చెల్లిస్తున్నామన్నారు. రోజుకు వెయ్యి రూపాయలు చెల్లిస్తున్నామని పాక్ ప్రజలు పేర్కొంటున్నారు. అయితే, పాలు, చక్కెర, గోధుమలు, బియ్యం లాంటివి కొనుగోలు చేయలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేక పోతున్నామని దినసరి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.