NTV Telugu Site icon

Pakistan Blast: పాకిస్థాన్ లో బాంబ్ బ్లాస్ట్.. ఏడుగురు మృతి

Pakisthan

Pakisthan

పాకిస్థాన్ దేశంలో నిన్న (సోమవారం) అర్ధరాత్రి బలూచిస్తాన్‌లోని పంజ్‌గూర్ జిల్లాలో ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు ల్యాండ్‌మైన్ పేల్చారు. ఈ పేలుడులో యూనియన్ కౌన్సిల్ ఛైర్మన్‌ సహా కనీసం ఏడుగురు మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే, నిన్న (సోమవారం) సాయంత్రం ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న బల్గతార్ యుసీ ఛైర్మన్ ఇష్తియాక్ యాకూబ్ తో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న ఇతరులను లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రిమోట్ సాయంతో పేల్చడానికి ల్యాండ్‌మైన్ అమర్చారని పంజ్‌గూర్ డిప్యూటీ కమిషనర్ అమ్జద్ సోమ్రో ప్రకటించారు.

Read Also: Sahara Refund Status: 11 ఏళ్లలో రూ.138.07 కోట్లు పొందిన సహారా ఇన్వెస్టర్లు… వివరాలు వెల్లడించిన సెబీ

వాహనం బల్గతార్ ప్రాంతంలోని చకర్ బజార్ దగ్గరకు రాగానే దుండగులు రిమోట్ సాయంతో వాహనాన్ని పేల్చివేశారని ఫలితంగా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించినట్లు స్థానికులు చెప్పారు. మృతుల్లో మహ్మద్ యాకూబ్, ఇబ్రహీం, వాజిద్, ఫిదా హుస్సేన్, సర్ఫరాజ్, హైదర్ గా గుర్తించారు. వీరంతా బల్గతార్, పంజ్‌గూర్‌ ప్రాంతానికి చెందినవారని పోలీసులు అన్నారు.

Read Also: Viral Video Today: పొరపాటున ఫస్ట్ గేర్‌.. జలపాతంలో పడిపోయిన కారు! వీడియో వైరల్

ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో 2014లో ఇష్తియాక్ యాకూబ్ తండ్రి యాకుబ్ బల్గాత్రితో పాటు అతని పదిమంది అనుచరులను కూడా ఇదే తరహాలో బాంబు దాడిలో హత్య చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఆనాటి ఆ దాడికి సూత్రధారులం తామేనంటూ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అప్పుడే ప్రకటించింది. తాజాగా జరిగిన సంఘటనకు కూడా వారే బాధ్యులై ఉంటారని అధికారులు భయపడుతున్నారు. అయితే, ఈ దాడి ఎవరు చేశారు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.