Site icon NTV Telugu

Visakhapatnam: ఏపీలో పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ ముఠా అరెస్ట్..

Cyber Crime

Cyber Crime

పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ ముఠా అరెస్టు చేశారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలు పోలీసులు గుర్తించారు. లోన్ యాప్ ల ద్వారా ఆర్థిక నేరాలకి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడుతో సహా 9 మంది అరెస్ట్ అయ్యారు. రూ. 2 వేల రూపాయలు లోన్ యాప్ లో అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పురోగతి లభించింది. నరేంద్ర భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి బంధువులకి పంపారు సైబర్ నేరగాళ్లు.

READ MORE: Pakistan: పాకిస్థాన్‌లో హిందూ టైగర్ రాణా హమీర్ సింగ్.. ముస్లింల మధ్య ఇప్పటికీ ధీమాగా జీవిస్తున్నారు..

అవమాన భారంతో పెళ్లయిన 40 రోజులుకి నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు..పాకిస్థాన్ కేంద్రంగా ఈ ముఠా నడుస్తున్నట్టు గుర్తించారు. సుమారు భారత్ నుంచి 9 వేల మంది బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్టు గుర్తించారు. 18 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 54 సిమ్‌ కార్డులు, 60 లక్షల రూపాయల నగదు ఫ్రిజ్ చేశారు.

READ MORE: Shruti Haasan : నాకు ట్రూ లవ్ కావాలి.. అందుకే బ్రేకప్ అయిన బాధపడను

Exit mobile version