Site icon NTV Telugu

India Pakistan Tension: భారత పైలట్ ఎవరూ మా అదుపులో లేరు.. మా యుద్ధ విమానం దెబ్బతింది..

Pak1

Pak1

భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఇందులో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. వీరిలో పుల్వామా దాడిలో పాల్గొన్న యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదస్సిర్ అహ్మద్ ఉన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించారు. దీని ఫలితంగా పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించింది.

Also Read:Kollywood : సీక్వెల్స్ కింగ్ గా మారిన యంగ్ హీరో

ఆదివారం రాత్రి పాకిస్తాన్ నేవీ, వైమానిక దళం, ఆర్మీ అధికారులు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి, భారతదేశంతో జరిగిన ఘర్షణలో తమ విమానం దెబ్బతిన్నట్లు అంగీకరించారు. అయితే, ఏ విమానం దెబ్బతిన్నదో లేదా దాని పేరు ఏమిటో పాకిస్తాన్ వెల్లడించలేదు. విలేకరుల సమావేశంలో, పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధిని, భారత పైలట్లలో ఎవరైనా పాకిస్తాన్ అదుపులో ఉన్నారా అని అడిగారు. దీనికి ప్రతిస్పందనగా భారత పైలట్లు ఎవరూ పాకిస్తాన్ అదుపులో లేరని వెల్లడించారు.

Also Read:Naveen Chandra : సినిమా నచ్చకుంటే..మీ డబ్బు వెనక్కి ఇచ్చేస్తాం

26 భారత సైనిక స్థావరాలపై దాడి చేశాం

పాకిస్తాన్ 26 భారత సైనిక స్థావరాలపై దాడి చేసిందని లెఫ్టినెంట్ చౌదరి పేర్కొన్నారు. ఇందులో వైమానిక దళం, వైమానిక స్థావరాలు ఉన్నాయన్నారు. సూరత్‌గఢ్, సిర్సా, భుజ్, నాలియా, అధంపూర్, బటిండా, బర్నాలా, హల్వారా, అవంతిపురా, శ్రీనగర్, జమ్ము, ఉధంపూర్, మామున్, అంబాలా, పఠాన్‌కోట్‌లోని భారత సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి. అంతేకాకుండా, బియాస్, నగ్రోటాలోని బ్రహ్మోస్ క్షిపణి నిల్వ కేంద్రాలపై కూడా దాడి జరిగిందని ఆరోపించారు.

Also Read:Zelensky: యుద్ధాన్ని ముగించేందుకు “పుతిన్‌ను కలవడానికి సిద్ధంగా ఉన్నాను”.. జెలెన్స్కీ సంచలన పోస్ట్.!

ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌లో విధ్వంసం సృష్టించింది.

ఆపరేషన్ సిందూర్‌లో లష్కరే తాయిబా, జైషే మహ్మద్‌కు చెందిన ఖలీద్ అలియాస్ అబూ ఆకాషా, ముదస్సర్ ఖడ్యాన్, మహ్మద్ రసమ్ ఖాన్, హఫీజ్ మహ్మద్ జమీల్ సహా 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఉండటం పాకిస్తాన్‌ వక్ర బుద్దిని బయటపెట్టింది. పాకిస్తాన్ DGMO అభ్యర్థన మేరకు, మే 10న సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు భారతదేశం అంగీకరించింది. కానీ “ఉగ్రవాదాన్ని యుద్ధంగా పరిగణిస్తాము”.. సింధు జల ఒప్పందం రద్దు చేశామని స్పష్టం చేసింది. పాకిస్తాన్ తో నేడు (సోమవారం) డీజీఎంఓ స్థాయి చర్చలు జరగనున్నాయి.

Exit mobile version