Site icon NTV Telugu

Pulwama Attack: పుల్వామా దాడిపై ఆరేళ్ల తర్వాత పాకిస్థాన్ సంచలన ప్రకటనతో.. భారతీయుడి రక్తం మరిగింది!

Pak

Pak

Pulwama attack: నేటితో పుల్వామా దాడికి సరిగ్గా ఏడేళ్లు. 2019, ఫిబ్రవరి 14.. సరిగ్గా ఐదేళ్ల క్రితం జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. ఇది భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడుల్లో ఒకటి. ఈ భయానక దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి అనంతరం.. పాకిస్థాన్‌కు భారత్ గుణపాఠం చెప్పిన తీరు గతంలో ఎన్నడూ జరగలేదు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా పాక్‌పై భారత్ కఠిన చర్యలు అవలంబించింది. సర్జికల్ స్ట్రైక్ రూపంలో బదులు తీర్చుకుంది. పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన భారత సైన్యం పాక్‌ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇంతకీ పుల్వామా దాడి అనంతరం పాకిస్థాన్ ఎలాంటి ప్రకటన చేసిందో మీకు గుర్తుందా? ఈ ప్రకటన ఇప్పుడు చదివినా ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది.

READ MORE: IND vs PAK: భారత్-పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్.. తుది జట్టులోకి కుల్దీప్ యాదవ్ వచ్చేనా..?

పుల్వామా దాడి అనంతరం దేశం మొత్తం బాధలో ఉండగా పాకిస్థాన్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. “పుల్వామాలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది మరణానికి కారణమైన బాంబుదాడి వెనుక మా హస్తం ఉంది.” అని పాక్‌ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆ దేశ వాయుసేన ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ ఆపరేషన్ సిందూర్ అనంతరం ఔరంగజేబ్‌ అహ్మద్‌ లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చెప్పాడు. దాదాపు ఆరేళ్ల తరువాత పాకిస్థాన్ ఒప్పుకుంది. అప్పటి వరకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన పాకిస్థాన్ ఒక్కసారిగా చేసిన ప్రకటన దేశాన్ని కుదిపేసింది. ప్రతి భారతీయుడి రక్తం మరిగింది. ‘‘పాక్‌కు చెందిన గగనతలం, భూభాగం, జల సరిహద్దులకు లేదా ప్రజలకు ముప్పుగా పరిణమిస్తే.. వాటిని ఎదుర్కొనేందుకు మేం రాజీ పడబోం. దానిని పట్టించుకోకుండా ఉండలేం.. మా దేశానికి కట్టుబడి ఉంటాం. మా దేశ ప్రజల కీర్తి మొత్తం దళాల్లోనే ఇమిడి ఉండటంతో.. మేము ఎప్పుడూ దానిని నిలబెట్టుకుంటాం. పుల్వామాలో మా అద్భుతమైన ఎత్తుగడలను చూపించాం. మా కార్యదక్షత.. వ్యూహాత్మక చతురతను ఇప్పటికే ప్రదర్శించాం’’ అని డీజీఐఎస్‌పీఆర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరీఫ్‌ చౌదురి వ్యాఖ్యానించాడు. దీంతో ఔరంగజేబ్‌ అహ్మద్‌ వ్యాఖ్యలతో పాక్‌ ఉగ్రవాదాన్ని పోషిస్తోందన్న విషయం మరోసారి స్పష్టమైంది.

READ MORE: Pulwama Attack 2019: జవాన్ల త్యాగం.. భారత చరిత్రలో చెరగని ముద్ర.. 40 మంది పుల్వామా అమరుల పేర్లు ఇవే..

Exit mobile version