Pakistan Win against England in Multan: పాకిస్థాన్ క్రికెట్ జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. సొంతగడ్డపై ఎట్టకేలకు టెస్టు విజయం సాధించింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 152 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించింది. దాంతో 1338 రోజుల నిరీక్షణకు తెరపడింది. స్వదేశంలో 11 మ్యాచుల అనంతరం తొలి గెలుపు దక్కడంతో పాక్ ప్లేయర్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చివరగా పాక్ స్వదేశంలో 2021 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌పై టెస్టు విజయం సాధించింది.
మార్చి 2022 నుండి పాకిస్థాన్‌కు స్వదేశంలో టెస్ట్ విజయం లేదు. సొంతగడ్డపై 11 మ్యాచ్‌లు ఆడగా.. 7 టెస్టుల్లో ఓడిపోయింది. ఇటీవల 0-2తో టెస్టు సిరీస్‌ను బంగ్లాదేశ్‌కు కోల్పోయింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 550కి పైగా పరుగులు చేసినా.. ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది. చాన్నాళ్లుగా స్వదేశంలో విజయానికి దూరమైన పాకిస్థాన్.. తిరిగి గెలుపు బాట పట్టాలని రెండో టెస్టుకు ముందు సంచలన నిర్ణయాలు తీసుకుంది. స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్‌ను జట్టు నుంచి తప్పించింది. అంతేకాదు షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, సర్ఫరాజ్ అహ్మద్‌లను కూడా పక్కనపెట్టింది.
Also Read: IND vs NZ: రవీంద్ర సెంచరీ.. భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్! భారత్‌కు కష్టమే
స్టార్ ప్లేయర్స్ లేకున్నా పాకిస్థాన్ అద్భుత విజయం సాదించింది. మొదటి ఇన్నింగ్స్‌లో అరంగేట్ర ప్లేయర్ కమ్రాన్ గులామ్ సెంచరీ (118)తో కదం తొక్కాడు. సయిమ్ అయుబ్ (77) కూడా రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 366 రన్స్ చేసింది. సాజిద్ ఖాన్ 7 వికెట్స్ తీయడంతో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 291 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 221 రన్స్ చేయగా.. ఆఘా సల్మాన్ (63) టాప్ స్కోరర్. నోమన్ అలీ 8 వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు 144 పరుగులకు ఆలౌట్ అయింది.