IND vs NZ: రవీంద్ర సెంచరీ.. భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్! భారత్‌కు కష్టమే
- రచిన్ రవీంద్ర సెంచరీ
- టిమ్ సౌథీ మెరుపు ఇన్నింగ్స్ తొలి టెస్టులో పట్టు బిగించిన న్యూజిలాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rachin Ravindra and Tim Southee’s 100 Plus Partnership: బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. మూడోరోజు ఆటలో లంచ్ బ్రేక్ సమయానికి కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 81 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 299కి చేరింది. స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర (104 నాటౌట్: 125 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేయగా.. పేసర్ టిమ్ సౌథీ (49 నాటౌట్: 50 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడుతున్నాడు. ఎనిమిదో వికెట్‌కు ఈ ఇద్దరు 97 బంతుల్లోనే 112 పరుగులను జోడించారు.
ఓవర్‌నైట్ 180/3 స్కోరుతో మూడోరోజైన శుక్రవారం ఆటను ప్రారంభించిన కివీస్..మొదటి సెషన్లో వరుసగా వికెట్స్ కోల్పోయింది. పేసర్లు సిరాజ్, బుమ్రాతో పాటు స్పిన్నర్ జడేజా వికెట్లు పడగొట్టారు. దాంతో న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి 233 రన్స్ చేసింది. ఇక కివీస్ ఇన్నింగ్స్ ముగియడానికి ఇంకెంతసేపు పట్టదని అందరూ అందుకున్నారు. కానీ రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీలు ఎదురుదాడికి దిగారు. పేస్, స్పిన్ బౌలింగ్‌ను చితకొట్టారు.
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
Also Read: IND vs NZ: రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 450 రన్స్ చేస్తుంది: ఆకాశ్
ముఖ్యంగా హాఫ్ సెంచరీ అనంతరం రవీంద్ర రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. అశ్విన్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నాడు. ఈ క్రమంలోనే బౌండరీతో సెంచరీ పూర్తిచేశాడు. మరోవైపు సౌథీ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జోడీని విడదీయడానికి కెప్టెన్ రోహిత్ బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకుండాపోయింది. ఇప్పటికే 300కి చేరువైన లీడ్‌తో మ్యాచ్‌పై కివీస్ పట్టు సాధించింది. ఇంకా రెండు రోజులు ఉండడంతో రోహిత్ సేన ఏ మేరకు పోరాడుతుందో చూడాలి. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!