NTV Telugu Site icon

High Cholesterol: ఈ భాగాలలో నొప్పిగా ఉందా? అధిక కొలెస్ట్రాల్‌ కావచ్చు.. జాగ్రత్త సుమీ

High Cholesterol

High Cholesterol

High Cholesterol: కొలెస్ట్రాల్ అనేది శరీరంలో కనిపించే ఒక రకమైన కొవ్వు. ఇది శరీరానికి చాలా అవసరం. ఎందుకంటే, ఇది కణాలను సరిచేయడంలో కొత్త కణాలను సృష్టించడంలో సహాయపడుతుంది. కానీ, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు అది గుండెపోటు, స్ట్రోక్స్, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. సాధారణంగా అధిక కొలెస్ట్రాల్ ప్రారంభ దశల్లో నిర్దిష్ట లక్షణాలు కనిపించవు. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కూడా కావచ్చు. కానీ, కొలెస్ట్రాల్ స్థాయి చాలా ఎక్కువ అయినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఇందులో కొన్ని సాధారణ లక్షణాలు ఏంటంటే..

Also Read: Health Tips: ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు..

అధిక కొలెస్ట్రాల్ ధమనులను గట్టిగా, ఇరుకైనదిగా చేస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. గుండెకు తగినంత ఆక్సిజన్ అందనప్పుడు ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం అనిపించవచ్చు. దీనినే ఆంజినా అంటారు. అధిక కొలెస్ట్రాల్ కాళ్ళలో కూడా ధమనులను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కాళ్లలో నొప్పి, తిమ్మిర్లు, అలసట వంటివి వస్తాయి. నడక లేదా వ్యాయామం చేసేటప్పుడు ఇది ప్రత్యేకంగా అనుభూతి చెందుతుంది. దీనిని ఇంటర్‌మిటెంట్ క్లాడికేషన్ అంటారు.

Also Read: Actors Direction: యాక్టింగ్ చేస్తూనే డైరెక్టర్లుగా హిట్స్.. మరి మనోళ్లు?

ఇక అధిక కొలెస్ట్రాల్ వల్ల.. ఛాతీ నొప్పి, కాళ్ళలో నొప్పి, తలనొప్పి, తల తిరగడం, అలసట, వికారం, వాంతి, దృష్టి సమస్యలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం లాంటి లక్షణాలు ఏర్పడుతాయి. ఇకపోతే అధిక కొలెస్ట్రాల్ కారణంగా.. ఊబకాయం, ధూమపానం, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలకు దారి తీస్తాయి. ఇక వీటి నివారణ చర్యల విషయానికి వస్తే.. సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం తగ్గించాలి. వాటికీ బదులు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. ఇంకా రోజూ వ్యాయామం చేయండి. అలాగే సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించండి.