బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఐటీ దాడుల తర్వాత భువనగిరికి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి వచ్చారు. దీంతో.. ఎమ్మెల్యేకి గుమ్మడికాయతో మున్సిపల్ చైర్మన్, కార్యకర్తలు దిష్టి తీశారు. అయితే.. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి మసుకుంట ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ నాయకుల భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యాపారం వేరు రాజకీయం వేరని వ్యాఖ్యానించారు. బిజినెస్‌లో సంపాదించాను ప్రజా సేవ చేయడానికి వచ్చానని అన్నారు. మూడు రోజులు పాటు సోదాలు చేసిన ఐటి అధికారులు ఆన్ హ్యాపీగా వెళ్లారని, ఐటీ దాడులు రొటీన్ లో భాగంగానే జరిగాయని ఆయన వెల్లడించారు.
Also Read : Green Brinjal Benefits: ఈరోజు నుంచే గ్రీన్ వంకాయలను తినడం మొదలెట్టండి.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!
ఐటీ దాడులు వ్యాపార సంబంధించిన అంశం…. రాజకీయ కుట్రను నేను మాట్లాడలేనని ఆయన తెలిపారు. ఐటీ దాడులు చేసిన అధికారులు సక్సెస్ కాలేదని, మీడియాలో అనేక అవస్తవాలు వచ్చాయి వాటిని నేను ఖండిస్తున్నానన్నారు. మా మామగారి ఇంట్లో సోదాలు అవాస్తవమన్న ఎమ్మెల్యే.. సౌతాఫ్రికాలో నాకు ఎలాంటి మైనింగ్ వ్యాపారం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఎమ్మె్ల్యే శేఖర్ రెడ్డితో పాటు మర్రి శశిధర్ రెడ్డి నివాసాల్లో కూడా ఐటీ అధికారులు మూడు రోజుల పాటు సోదాలు చేశారు. దాదాపు 70 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేశాయి. హైదరాబాద్ లోని ఇల్లు, ఆఫీసుల్లో తనిఖీలు జరిగాయి. ఇక శేఖర్ రెడ్డి దగ్గర పనిచేసే సిబ్బంది ఇళ్లల్లో కూడా ఐటీ రైడ్స్ జరిగినట్లు సమాచారం.
Also Read : Ameesha Patel: ఆ కేసులో భాగంగా కోర్ట్ లో లొంగిపోయిన అమీషా పటేల్..!!