NTV Telugu Site icon

Team India: డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. వైరల్‌గా హర్భజన్‌ పోస్ట్‌!

Harbhajan Singh

Harbhajan Singh

బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో దారుణ ప్రదర్శన చేసిన భారత జట్టుపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆట కంటే పాపులారిటీ, పేరు ప్రఖ్యాతులు ముఖ్యం కాదన్నారు. టీమిండియా సూపర్‌స్టార్‌ సంస్కృతిని వీడాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో భజ్జీ మరో పోస్ట్‌ చేశారు. ‘మార్కెట్లో ఏనుగు నడిచి వెళ్తుంటే డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి’ అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టాడా? అని ఫాన్స్ చర్చిస్తున్నారు.

Also Read: INDW vs IREW: ఐర్లాండ్‌తో భారత్‌ తొలి వన్డే.. జోరు కొనసాగేనా!

గత కొన్ని నెలలుగా భారత జట్టు ప్రదర్శన బాగోలేదు. ముఖ్యంగా టెస్టుల్లో పేలవ ఆటతీరును ప్రదర్శిస్తోంది. స్వదేశంలో న్యూజీలాండ్ చేతిలో వైట్‌వాష్, తాజాగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-3తో కోల్పోయింది. ఈ నేపథ్యంలో భారత్ ఆటతీరు గురించి హర్భజన్‌ సింగ్ స్పందించాడు. ‘రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నంత కాలం అంతా సజావుగానే సాగింది. భారత్ స్వదేశంలో ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌ సాధించింది. టీ20 ప్రపంచకప్ 2024 కూడా గెలిచింది. కానీ ఉన్నపళంగా టీమిండియాకు ఏమైంది?. నాకు ఏమీ అర్థం కావడం లేదు. గత ఆరు నెలల్లో శ్రీలంక చేతిలో వన్డే సిరీస్‌ కోల్పోయాం, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్ వాష్‌ అయ్యాం, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-3తో కోల్పోయాం. ఇప్పుడు అంతా పతనమైనట్లు కనిపిస్తోంది. ప్రతి ఆటగాడికి పాపులారిటీ, పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అయితే ఆట కంటే ఏదీ ముఖ్యం కాదు. అప్పట్లోనే కపిల్‌ దేవ్, అనిల్‌ కుంబ్లే లాంటి పెద్ద మ్యాచ్‌ విన్నర్లను కూడా జట్టు నుంచి తప్పుకోవాలని సెలక్టర్లు చెప్పారు. భారత్ సూపర్‌స్టార్‌ సంస్కృతిని వదిలిపెట్టాలి’ అని హర్భజన్‌ అన్నారు.

Show comments