NTV Telugu Site icon

Padma Vibhushan: పద్మ విభూషణ్ ను అందుకున్న వెంకయ్య నాయుడు..

Padma Vibhushan For Venkaiah Naidu

Padma Vibhushan For Venkaiah Naidu

Padma Vibhushan For Venkaiah Naidu: తాజాగా భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘పద్మ’ అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందించారు. ఏప్రిల్ 22, సోమవారం నాడు సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఏడాది వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 132 మంది వ్యక్తులకు పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

Also Read: MaheshBabu SRH: ఎస్ఆర్హెచ్ కెప్టెన్ తో టాలీవుడ్ సూపర్ స్టార్.. వైరల్ పిక్..

ఈ కార్యక్రమంలో భాగంగా పద్మవిభూషణ్ పురస్కారాన్నిమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 25న ఈ జాబితాను ప్రకటించింది. ఈ ప్రకటనలో భాగంగా ఐదుగురికి పద్మ విభూషణ్ లు, 17 మందికి పద్మభూషణ్ లు, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు సినీ నటుడు కొణిదెల చిరంజీవికి కూడా పద్మవిభూషణ్ అవార్డుకు ఎన్నికయ్యారు.

Also Read: Buggana Rajendranath: మీకు అభివృద్ధి అంటే అర్థం తెలుసా?.. కోట్ల, కె.యి లపై ఫైర్

ఈ లిస్ట్ లో మన తెలుగు వారు నారాయణపేటకు చెందిన బుర్ర వీణ వాద్యకారుడు దాసరి కొండప్ప, జనగాంలోని చిందు యక్షగానం రంగస్థల కళాకారుడు గడ్డం సమ్మయ్య లకు పద్మశ్రీలు, అలాగే కళా రంగానికి చెందిన ఎ.వేలు ఆనందాచారి కూడా వారే. సాహిత్యం & విద్యా రంగంలో కేతావత్ సోమ్‌లాల్, కూరెళ్ల విట్టలాచార్యలకు కూడా ఈ అవార్డ్స్ దక్కనున్నాయి. ఏపీ నుంచి తొలి మహిళా హరికథా వ్యాఖ్యాత ఉమా మహేశ్వరి కూడా అవార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు.