హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను పద్మ పురస్కారాలు వరించాయి. గురువారం కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఏపీకి రెండు పద్మవిభూషణ్‌లతో పాటు ఒక పద్మశ్రీ, తెలంగాణకు ఐదు పద్మశ్రీలు లభించాయి. ఈ సందర్భంగా పద్మశ్రీ గ్రహీతలు తమ సంతోషాన్ని ఎన్టీవీతో పంచుకున్నారు.
Read Also: MLC Kavitha: తెలంగాణ జాగృతి పలు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోంది..
పద్మశ్రీ అవార్డు రావడం సంతోషంగా ఉందని ఏపీకి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉమా మహేశ్వరి తెలిపారు. ఎన్టీవీతో ఆమె మాట్లాడారు. జాతీయ స్థాయిలో హరికథకు వచ్చిన గుర్తింపు అని పేర్కొ్న్నారు. కళను గుర్తించిన కేంద్రానికి ధన్యవాదాలు చెప్పారు. తమ కుటుంబ సభ్యులంతా కళాకారులేనని తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచే హరికథను నేర్చుకున్నట్లు వెల్లడించారు. ఈ తరం యువత కూడా హరికథను నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రిని కలిసి హరికథను ప్రోత్సహించాలని కోరనున్నట్లు చెప్పుకొచ్చారు. హరికథ నేర్చుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందిస్తే బాగుంటుందని ఉమా మహేశ్వరి అభిప్రాయపడ్డారు
Read Also: Bihar Politics: అధికారం కోసం లాలూ విశ్వప్రయత్నాలు.. మద్దతు కోసం డిప్యూటీ సీఎం పదవులు ఆఫర్..
తండా మట్టి వాసన ఢిల్లీ వరకు వెళ్లిందని పద్మశ్రీ అవార్డు గ్రహీత కేతావత్ సోమ్లాల్ ఆనందం వ్యక్తం చేశారు. భగవద్గీతను కేతావత్ సోమ్లాల్ బంజారా భాషలో అనువదించారు. ఇందుకు గాను పద్మశ్రీ అవార్డును కేంద్రం ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఆయన మాట్లాడుతూ.. తన కళను గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. భాష కనుమరుగు కాకూడదనే బంజారా భాషలో పుస్తకాలు, పాటలు రాసినట్లు తెలిపారు. జీవిత సారాన్ని తెలియజేసే భగవద్గీతను బంజారా భాషలో రాసినట్లు వెల్లడించారు. తెలుగులో రాస్తే గుర్తింపు వస్తుందని చాలా మంది సూచించారు. కానీ వారి మాట వినకుండా బంజారా భాషలోనే రాసినట్లు చెప్పుకొచ్చారు. పద్మశ్రీ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని సోమ్లాల్ చెప్పుకొచ్చారు.