కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ప్రజలందరి కళ్ళ ముందు ఉందన్నారు. హుజూరాబాద్ నియోజక వర్గం లో ఎమ్మేల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తరువాత 300 కోట్లతో అభివృద్ధి చేశామని ఆయన వెల్లడించారు. భారత దేశం లో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి హుజూరాబాద్ నియోజక వర్గం లో వందకు వంద శాతం పూర్తి చేయడం జరిగిందని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
అంతేకాకుండా.. ‘కేసీఆర్ కు దళితుల మీద ఉన్న ప్రేమ భారత దేశం లో ఏ నాయకునికి లేదు. దళిత బంధు పథకం ద్వారా లబ్ది పొందిన ఒక్కో కుటుంబం నెలకు ముప్పై వేలు సంపాదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లో గత పది సంవత్సరాల నుండి ముప్పై ఏడు వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనత కేసీఆర్ ది. రైతులు బాగుండాలని 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు రైతు బంధు,పథకాన్ని ప్రవేశ పెట్టారు.. తెలంగాణ రాష్ట్రం రాక ముందు రెండు వందలు ఉన్న అసరా పెన్షన్ రెండు వేలు చేసిన ఘనత కేసీఆర్ ది.. హైదరాబాద్ ను అమెరికా ల ఉన్న న్యూయార్క్ లాగా కరీంనగర్ ను లండన్ ల తయారు చేశారు సీఎం కేసీఆర్.. తెలంగాణ బీఅర్ ఎస్ వంద సీట్లు గెలిచి కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కాక తప్పదు అందులో మొదట గెలిచే సిట్ హుజూరాబాద్ ది.
హుజూరాబాద్ లో బీఆర్‌ఎస్ ఎవరు ఊహించని మెజారిటీ వచ్చి తీరుతుంది. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల దిమ్మ దిరిగిపోయింది. సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళ కు మూడు వేల రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయం.. బీఅర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ను నియోజక వర్గం లో ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తాం. గత ఎమ్మేల్యే కు ఇరవై సంత్సరాలు అవకాశం ఇచ్చారు నాకు ఒక్క సారి అవకాశం ఇచ్చి చూడండి. నేను చేసే వాగ్దానాలో ఒక్కటి అమలు చేయలేకపోయిన స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ముక్కు నెలకు రాస్తా.. సీఎం కేసీఅర్ కాళ్ళు మొక్కైన వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసి మరో సిద్దిపేటలాగా మారుస్త.. బీఅర్ఎస్ పార్టీ వంద సీట్లతో సెంచరీ చేయబోతోంది బీజేపీ డకౌట్ కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ రన్ ఔట్ కాబోతుంది.’ అని పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.