Site icon NTV Telugu

Karimnagar: వామ్మో వడ్ల దొంగలు.. ఐకేపీ సెంటర్ వద్ద ఆరబెట్టి ధాన్యం చోరీకి యత్నం..

Vadlu

Vadlu

Karimnagar: కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ మండలం రంగపేటలో వడ్ల దొంగతనం కలకలం రేపింది. రంగపేట ఐకేపీ సెంటర్ వద్ద అర్ధరాత్రి ఇద్దరు దొంగలు వడ్ల సంచులు దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. టాటా ఏసీ వాహనంలో సుమారు 20 వడ్ల సంచులు ఎక్కిస్తున్న సమయంలో రైతులు అప్రమత్తమయ్యారు. తక్షణమే అక్కడికెళ్లిన రైతులు దొంగలను అడ్డుకున్నారు. ఆ సమయంలో ఒక దొంగను పట్టుకుని గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ దొంగ మానకొండూర్‌కు చెందిన జహీద్‌గా పోలీసులు గుర్తించారు. రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన మరో దొంగ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఐకెపి సెంటర్ వద్ద నిల్వ చేసిన వడ్లు రాత్రివేళల్లో దొంగతనం చేస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: Woman Alleges Mother: అసలు నువ్వు తల్లివేనా.. కన్నకూతరినే వ్యభిచారంలోకి..

Exit mobile version