Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Paddy Cultivation Area And Yield Increased In Telangana

Telangana News: కాళేశ్వరం లేకున్నా.. ధాన్యం దిగుబడిలో చరిత్ర సృష్టించిన తెలంగాణ..

Published Date :December 5, 2024 , 6:34 pm
By RAMAKRISHNA KENCHE
  • పెరిగిన సాగు విస్తీర్ణం.. ధాన్యం దిగుబడిలో రికార్డు
  • ప్రాజెక్టుల కింద పెరిగిన ఆయకట్టు
  • కృష్ణా, గోదావరి జలాల వాటాలపై పంతం
  • ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేసే లక్ష్యం
Telangana News: కాళేశ్వరం లేకున్నా.. ధాన్యం దిగుబడిలో చరిత్ర సృష్టించిన తెలంగాణ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

వ్యవసాయ ప్రాధాన్యతకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం తొలి ఏడాదిలోనే సాగునీటి రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కృష్ణా జలాల పంపిణీలో న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. బీఆర్ఎస్ హయాంలోని పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన లోటుపాట్లు, విధ్వంసకర పరిస్థితులపై ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేత పత్రం సమర్పించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. లక్ష కోట్లతో అప్పటి ప్రభుత్వం నిర్మించి కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు కుంగిపోయిన తీరుపై ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలోనే చర్చకు పెట్టింది. నీటిపారుదల రంగంలో పదేళ్లలో పెట్టిన ఖర్చులు, తెచ్చిన అప్పులు, ఆయకట్టు తీరుతెన్నులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ను నియమించింది.

సాగునీటిని అందించే ప్రాజెక్టులపైనే దృష్టి
గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టులను రైతులకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రాధాన్యమిచ్చింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కేంద్రీకరించారు. నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, ఎస్సారెస్పీ స్టేజీ 2, సదర్మట్ ప్రాజెక్టులపై ముందుగా ఫోకస్ చేసింది. రూ.241 కోట్ల ఖర్చుతో దాదాపు 48 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేలా పనులు ప్రారంభించింది. 2025 మార్చి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని టార్గెట్​గా పెట్టుకుంది. గోదావరి బేసిన్ లో ఉన్న చిన్న కాళేశ్వరం, మోదికుంట, లోయర్ పెన్ గంగా, చనాక కోరాట, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టు, కృష్ణా బేసిన్ లో కోయిల్​సాగర్​, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ పనులు ఈ ప్రాధాన్యత జాబితాలో చేర్చింది. ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసే దేవాదుల ఎత్తి పోతల ప్రాజెక్టుకు అవసరమైన 2,947 ఎకరాల భూసేకరణ చేపట్టి.. 89,312 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఫోకస్..
గత ప్రభుత్వం మొట్టమొదటగా కొబ్బరికాయ కొట్టి అసంపూర్తిగా వదిలేసిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఆర్థిక సాయం అందించాలని అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన పథకంలో ఈ ప్రాజెక్టును చేర్చి ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఆగస్ట్ 15వ తేదీన ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభించారు. గత ప్రభుత్వం రూ. 7400 కోట్లు ఖర్చు పెట్టి.. ఒక్క ఎకరం కూడా నీళ్లు ఇవ్వకుండా వదిలేసిన ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం 482.87 కోట్లతో ఎనిమిది నెలల్లోనే పూర్తి చేసింది. 9 కిలోమీటర్ల రాజీవ్​ లింక్ కెనాల్ ద్వారా సీతారామ నీటిని నాగార్జునసాగర్ కెనాల్ కు అనుసంధానం చేసి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించటం రికార్డు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సాగునీటితో పాటు ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును గత ప్రభుత్వం విస్మరించింది. ఎస్ఎల్బీసీ పనులను ప్రజా ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. సాంకేతిక నిపుణులతో కమిటీ వేసి అత్యాధునిక యంత్ర పరికరాలను విదేశాల నుంచి తెప్పించింది. 2027 సెప్టెంబర్ లోగా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో రూ. 4,658 కోట్లు కేటాయించింది.

నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు..
2014కు పూర్వం ప్రతిపాదించిన నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు ఫిబ్రవరి నెలలోనే ప్రజా ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ తో పాటు మక్తల్, నారాయణపేట్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరు, తాగునీటిని అందించే ఈ ప్రాజెక్టుకు రూ.4350 కోట్లు కేటాయించింది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు తో పాటు సీతారామ లిప్ట్, సమ్మక్క-సారక్క ప్రాజెక్టు కు అవసరమైన అనుమతులను తెచ్చుకునేందుకు ప్రభుత్వం కేంద్రంతో, మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గత ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌ గతేడాది అక్టోబర్‌లో కుంగిపోగా, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో బుంగలు పడి ప్రమాదకర పరిస్థితి తలెత్తింది. లోపాలను గుర్తించి పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యల బాధ్యతను నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్‌ఏ)కి అప్పగించింది. ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికలోని సిఫారసుల ఆధారంగా వానాకాలం ప్రారంభానికి ముందే బరాజ్‌లకు అత్యవసర మరమ్మతులు నిర్వహించింది. జియోఫిజికల్‌, జియోటెక్నికల్‌ పరీక్షలు నిర్వహించింది. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ప్రభుత్వం ఈ ఏడాది మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో చుక్క నీటిని నిల్వ చేయలేదు.

ఈ వానాకాలంలో 67 లక్షల ఎకరాల్లో వరి సాగు..
కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండానే ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టుల కింద రికార్డు స్థాయిలో పంటలు సాగయ్యాయి. ఈ వానాకాలంలో 67 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 153 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరగడం విశేషం. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధిక రికార్డు. యాసంగిలో కూడా 42.11లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం ఇటీవలే సాగునీటి ప్రణాళికను విడుదల చేయటం గమనార్హం. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని, ఈ నీటిని వినియోగించేలా చేపట్టిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. నీటి వాటాలు, గోదావరి కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు ఇంతకాలం జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని అధికారం చేపట్టినప్పటి నుంచీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో అడుగులేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉండగా.. ఏపీలో కేవలం 30 శాతం ఉంది. అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం కృష్ణా జలాల్లోని 1005 టీఎంసీల్లో 70 శాతం రాష్ట్ర వాటా సాధించేలా ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించటం గమనార్హం.

 

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • chief minister
  • Krishna water
  • Paddy Cultivation
  • revanth reddy
  • telangana

తాజావార్తలు

  • Aditya Dhar : దటీజ్ ప్రభాస్.. ది లెజెండ్..

  • HIV Injection Case: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలికి HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. అవమానంతో యువతి..

  • Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?

  • Fuel Price Hike: యుద్ధం ఎఫెక్ట్.. వరుసగా నాల్గోసారి పెరిగిన పెట్రో ధరలు.. పెట్రోల్‌పై రూ.17, డీజిల్‌పై రూ.25 వడ్డింపు

  • Justice Yashwant Varma Resigns: సంచలన నిర్ణయం.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions