Asaduddin Owaisi : మోడీపై విరుచుకుపడ్డ అసదుద్దీన్ ఒవైసీ.. “వక్ఫ్ బిల్లు విషం లాంటిదే”
- వక్ఫ్ బిల్లుపై మోడీ ప్రభుత్వంపై అసదుద్దీన్ ఘాటు విమర్శలు
- మోడీ మాటలు బట్టతలకు మందు లాంటివే
- శాంతియుత పోరాటం కొనసాగుతుంది – అసదుద్దీన్ ఓవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ చేస్తున్న చర్యలను తీవ్రంగా విమర్శించారు. సభలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఒవైసీ మాట్లాడుతూ, “అందరూ మీ ఫోన్‌లలో లైట్లు ఆన్ చేయండి. మీరు వెలిగించినది ఫోన్ లైట్ కాదు… బీజేపీ నాయకుల మెదళ్లలో వెలిగించిన తెలివి,” అన్నారు. ప్రధాని మోడీ గత 11 ఏళ్లుగా మజీదులను ధ్వంసం చేయాలని చూస్తున్నారని, ముస్లింల ఇళ్లను కూల్చుతున్నారని ఆయన ఆరోపించారు.
వక్ఫ్ బిల్లును విమర్శిస్తూ, “మోడీ వక్ఫ్ బిల్లు వల్ల ముస్లింలకు మేలు జరుగుతుందని చెబుతున్నాడు. ఇది నిజం కాదు. ఇది బట్టతలకు జుట్టు వచ్చే మందు అని చెప్పినట్టే. మోడీ రాస్తున్నది మందు కాదు… విషం,” అంటూ ఎద్దేవా చేశారు. ఓల్డ్ సిటీలో ఓ వ్యక్తి బట్టతలకు మందు పెట్టిస్తే జుట్టు వస్తుందని చెప్పడంతో జనాలు నమ్మి క్యూ కట్టారని ఉదాహరణగా చెప్పిన ఆయన, మోడీ మాటలు కూడా అలాంటివేనని వ్యాఖ్యానించారు.
Also Read
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్‌కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్‌కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్‌లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
వక్ఫ్ బిల్లును తిప్పిపంపే వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేసిన ఒవైసీ, పార్లమెంట్ సెషన్‌లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతానన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. “ఈ దేశం అందరిదీ, ఎవరి అబ్బ జాగీరు కాదు. మోడీ అంబేద్కర్ కాలి గోటి స్థాయికి కూడా రావడని, బీజేపీ మత విద్వేష రాజకీయాలు చేస్తోందని” మండిపడ్డారు.
బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఒవైసీ పేర్కొన్నారు. “మత ఘర్షణలు వస్తాయని భయపెట్టినా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మేము రాజ్యాంగాన్ని నమ్ముతాం. మోడీ నాటకాలకు మేము భయపడం,” అన్నారు. ఇప్పుడు దేశంలో ముస్లింల హక్కుల కోసం, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం శాంతియుతంగా, చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా..?
-
Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
-
West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్‌కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!