NTV Telugu Site icon

Asaduddin Owaisi: “బీజేపీ టార్గెట్ అదే”.. వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో ఒవైసీ కీలక వ్యాఖ్యలు

Asaduddin Owaisi

Asaduddin Owaisi

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26ను ఉటంకిస్తూ వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వ ఉద్దేశాలను ఆయన ప్రశ్నించారు. “మత సమూహాలకు.. వారి మత, ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థలను స్థాపించి.. ఆ సంస్థలను వారే ముందుకు తీసుకెళ్లే హక్కును ఆర్టికల్ 26 ఇస్తుంది.” అని చెప్పారు. ప్రధాని మోడీ వక్ఫ్‌కు రాజ్యాంగంతో సంబంధం లేదని చెప్పారు.. ఒక్కసారి ఆర్టికల్ 26ను చదవండి అని ఒవైసీ సూచించారు.

READ MORE: Vijay Paul: ముగిసిన విజయ్‌పాల్ కస్టడీ.. ఇంకా దొరకని సమాధానాలు!

ప్రభుత్వం అధికార బలంతో వక్ఫ్ ఆస్తులను లాక్కోవాలని యోచిస్తోందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. వక్ఫ్ ఆస్తులను లాక్కోవడమే బీజేపీ ఉద్దేశమని.. ఇది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ.. వక్ఫ్ ఆస్తులను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను మతపరమైన, సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందని, అయితే ప్రభుత్వం దానిని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఒవైసీ చెప్పారు. ఇది మైనారిటీల హక్కులపై దాడి అని అని తీవ్రంగా ఖండించారు.

READ MORE:YSRCP: జగన్ జన్మదినం రోజున సేవా కార్యక్రమాలు.. పార్టీ శ్రేణులకు వైసీపీ పిలుపు

ఇండియా కూటమి పక్షాల నిరసన మధ్య కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్‌సభలో మైనార్టీ వ్యవహరాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గత సమావేశంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లిం సమాజం మెచ్చుకునేదిగా ఉందని మంత్రి పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు చట్టంలో ఉన్న లొసుగులను సరిచేయడం కోసమే ఈ బిల్లు తీసుకొచ్చామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు చట్టాన్ని సరిగ్గా రూపొందించలేదన్నారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని ఏ అధికరణకు వ్యతిరేకంగా లేదన్నారు. రాజకీయ కారణాలతో బిల్లు తీసుకొచ్చారని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కిరణ్ రిజిజు సభలో స్పష్టం చేశారు. 2014 తర్వాత వక్ఫ్ బోర్డు చట్టంపై ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించామని, ఎంతోమంది ప్రజలతో మాట్లాడి.. వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ బిల్లు తీసుకొచ్చామన్నారు. అనేకమంది ముస్లిం పెద్దలు, ముస్లిం సంస్థలను కలిసి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుని దానికి అనుగుణంగా బిల్లు తీసుకొచ్చినట్లు కిరణ్ రిజిజు చెప్పారు. ఆన్‌లైన్‌లో కూడా ప్రజల అభిప్రాయాలు స్వీకరించామన్నారు. ఎవరిని సంప్రదించకుండా బిల్లు తీసుకొచ్చామనడం సరికాదన్నారు.