NTV Telugu Site icon

Asaduddin Owaisi: కేసీఆర్ మూడో సారి సీఎం అవ్వడం పక్కా.. అసదుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకుంది. మరో ఎనిమిది రోజుల్లో పోలింగ్ ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మజ్లిస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తమ అభ్యర్థుల విజయాన్ని భుజస్కందాలపై వేసుకుని మరీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటింటి ప్రచారం, కార్నర్స్ మీటింగ్స్, బహిరంగ సభలతో అలుపెరగని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో HUWJ ఆధ్వర్యంలో జరిగే మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మళ్ళీ కేసీఅర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అన్నారు. గతంలో కూడా తాము వైయస్ రాజశేఖరరెడ్డి తో మాత్రమే ఉన్నామని కాంగ్రెస్ పార్టీతో లేమన్నారు. ఆర్ఎస్ఎస్ నిజామాబాద్ లో బలపడవద్దు అని… ఎంఐఎం అక్కడ పోటీ చేయడం లేదన్నారు.

Read Also:Indrakaran Reddy: కాంగ్రెస్‌, బీజేపీ రైతు వ్యతిరేక పార్టీలు.. మూడోసారి కేసీఆరే సీఎం..

ఈ సమయంలో అజారుద్దీన్ గురించి మాట్లాడుతూ ఆయన ఓ మంచి క్రికెటర్ అని.. తానో విఫల రాజకీయ నాయకుడిగా అభివర్ణించారు. హెచ్ సీఏ ప్రెసిడెంట్ గా అజారుద్దీన్ ను చేసిందే కేటీఆర్ అని గుర్తు చేశారు. ఇకపోతే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ ఏ మాత్రం నియోజకవర్గం కోసం పని చేయలేదన్నారు. దీంతోనే మాగంటి గోపీనాథ్ ప్రజలకు కనపడకుండా పోయారంటూ ఎద్దేవా చేశారు. అందుకే జూబ్లీ హిల్స్ లో ఎంఐఎం బలమైన అభ్యర్థి ని బరిలో నిలబెట్టింది అన్నారు. ఇకపోతే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి జీవితం ఆర్ఎస్ఎస్ లోనే ప్రారంభం అయ్యింది అన్నారు. తెలంగాణ గాంధీ భవన్ రిమోట్ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ చేతిలో ఉందన్నారు.

Read Also:Raviteja: క్రాకింగ్ కాంబినేషన్ కి బడ్జట్ కష్టాలా?