Rohingya Stranded: నడి సముద్రంలో చిక్కుకున్న 100 మందికి పైగా రోహింగ్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohingya Stranded: అండమాన్ దీవుల సమీపంలో ఓ పడవలో 100 మంది రోహింగ్యాలు చిక్కుకుపోయారని.. దాదాపు 16 నుంచి 20 మంది దాహం, ఆకలి లేదా నీటిలో మునిగి చనిపోయి ఉండొచ్చని మయన్మార్ రోహింగ్యా ఉద్యమకారులు తెలిపారు. మయన్మార్‌లో హింస నుండి తప్పించుకోవడానికి రోహింగ్యా ముస్లింలు ప్రమాదకరమైన పడవల్లోకి ఎక్కి ప్రాణాలను పణంగా పెట్టారని ఓ రోహింగ్యా ప్రతినిధి వెల్లడించారు. ప్రతి సంవత్సరం చాలా మంది రోహింగ్యాలు, ముస్లిం మైనారిటీ సభ్యులు మయన్మార్‌లో హింస, బంగ్లాదేశ్ శరణార్థి శిబిరాల్లోని ఆక్రమణల నుంచి తప్పించుకోవడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి దుర్భరమైన నౌకల్లోకి ఎక్కుతున్నారు. చాలామంది మలేషియా చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
సముద్రంలో చిక్కుకుపోయిన పడవను చేరుకోవడానికి ఐదు భారతీయ నౌకలు మంగళవారం ఆలస్యంగా చేరుకున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. తన వద్ద పంచుకోవడానికి ఎలాంటి వివరాలు లేవని భారత నౌకాదళ ప్రతినిధి వెల్లడించారు. “బహుశా 20 మంది చనిపోయారని అంచనా వేస్తున్నాము, కొంతమంది ఆకలి, దాహంతో, మరికొందరు నిరాశతో సముద్రంలోకి దూకారు. ఇది చాలా భయంకరమైనది, దారుణమైనది,” అని మయన్మార్ రోహింగ్యాలకు మద్దతుగా పనిచేసే అరకాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ క్రిస్ లెవా అన్నారు. ఆసియా పసిఫిక్ రెఫ్యూజీ రైట్స్ నెట్‌వర్క్‌కు చెందిన రోహింగ్యా వర్కింగ్ గ్రూప్ రెండు వారాలకు పైగా కొట్టుమిట్టాడుతోంది.
Also Read
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
- Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
- WWDCలో పొరపాటున 'ఫోల్డబుల్ ఐఫోన్' వివరాలు లీక్ చేసుకున్న Apple.!
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
Bharat Jodo Yatra: జోడో యాత్రకు కోవిడ్ ఎఫెక్ట్.. నిబంధనలు పాటించాల్సిందేనంటూ కేంద్రం లేఖ
వంద మందికి పైగా రోహింగ్యాలతో ఉన్న మరో పడవను వారాంతంలో శ్రీలంక నావికాదళం రక్షించింది.2018లో మయన్మార్‌లో సైనిక అణిచివేత తర్వాత 730,000 మందికి పైగా రోహింగ్యా ముస్లింలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు పారిపోయారు. మయన్మార్ సైనిక అణిచివేత అనంతరం సామూహిక హత్యలు, అత్యాచారాలు జరిగాయి. జర్నలిస్టుల హత్యలతో పాటు గ్రామాలు తగులబెట్టబడ్డాయని హక్కుల సంఘాలు నమోదు చేశాయి.
తాజావార్తలు
-
Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
-
APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
-
Sai Pallavi : పవర్ ఫుల్ పోలీస్ గా సాయిపల్లవి… ధనుష్ సినిమాలో లాఠీ పట్టనున్న బ్యూటీ
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?