NTV Telugu Site icon

Ovarian Cancer Risk: బ్యూటీషియన్స్ బీ అలెర్ట్.. క్యాన్సర్‌ ముప్పు తప్పదు!

Ovarian Cancer Beauticians

Ovarian Cancer Beauticians

Hairdresser and Beauticians have Higher Ovarian Cancer Risk: ‘అండాశయం’ ప్రతి స్త్రీకి ఎంతో ముఖ్యమైనది అన్న విషయం తెలిసిందే. స్త్రీ గర్భాశయానికి రెండు వైపులా రెండు అండాశయాలు ఉంటాయి. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. గర్భం కోసం ప్రతి నెలా ఎగ్స్, ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్లను ఉత్పత్తి చేయడమే అండాశయాల పని. అయితే చాలా మంది మహిళలు ఇటీవలి కాలంలో అండాశయ క్యాన్సర్‌ (ఒవేరియన్ కేన్సర్‌) బారిన పడుతున్నారు. ఒవేరియన్ కేన్సర్‌కి నిర్దిష్టమైన లక్షణాలు లేకపోవడంతో చివరి దశ చేరే వరకూ ఈ వ్యాధిని గుర్తించడం కష్టంగా మారింది. అందుకే ఒవేరియన్ కేన్సర్‌ని ‘సైలెంట్ కిల్లర్’ అని అంటారు.

మహిళలకు వచ్చే కేన్సర్‌లలో మొదటిది రొమ్ము కాన్సర్ కాగా.. రెండోది జననేంద్రియాల కేన్సర్‌. ఇక అండాశయ కేన్సర్‌ది మూడో స్థానం. చాలా సందర్భాలలో అండాశయ కేన్సర్‌కు కారణం (What Causes Ovarian Cancer) తెలియదు. అయితే ఒవేరియన్ కేన్సర్ వచ్చే రిస్క్‌ని ప్రభావితం చేసే అంశాలు చాలానే ఉన్నాయి. 50 ఏళ్లు దాటిన మహిళల్లో అండాశయ కేన్సర్ రిస్క్ ఎక్కువ. అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం కూడా రిస్క్‌ని పెంచుతుంది. అంతేకాదు దీర్ఘకాలంగా హెయిర్‌ డ్రెస్సర్లు, బ్యూటీషియన్లుగా పనిచేసే మహిళలకు ఒవేరియన్ క్యాన్సర్‌ ముప్పు ఎక్కువని తాజా ఓ అధ్యయనం పేర్కొంది. సేల్స్‌, రిటైల్‌, వస్త్ర తయారీ, నిర్మాణ రంగ పరిశ్రమల్లో పనిచేసే వారికి రిస్క్ (Ovarian Cancer Risk) ఉంటుందట.

Also Read: Ashes 2023: ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టిన వరణుడు.. ఆస్ట్రేలియాదే ‘యాషెస్‌’ సిరీస్‌!

కెనడాలోని మాంట్రియల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు 1,388 మంది మహిళలపై ఒవేరియన్ కేన్సర్‌ అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన మహిళల వయసు 18 నుంచి 79 ఏళ్ల మధ్య ఉంది. ఇందులో 491 మందికి అండాశయ క్యాన్సర్‌ ఉంది. హెయిర్‌ డ్రెస్సర్లు, హెయిర్‌ కటింగ్, బ్యూటీషియన్లుగా 10 ఏళ్లకు పైగా పనిచేసిన మహిళలకు అండాశయ క్యాన్సర్‌ ముప్పు మూడింతలు ఎక్కువ అని పరిశోధనలో తేలింది. 13 రకాల రసాయనాలకు వీరు ఎక్కువగా గురవుతుంటారని పేర్కొంది.

10 ఏళ్లకు పైగా నిర్మాణ రంగంలో ఉన్న మహిళలకు అండాశయ క్యాన్సర్‌ ముప్పు మూడింతలు అధికం అని మాంట్రియల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎంబ్రాయిడరీ, వస్త్ర పరిశ్రమలో దీర్ఘకాలం పాటు పనిచేసిన వారికి 85 శాతం ముప్పు ఎక్కువ అని అంటున్నారు. సేల్స్‌ రంగంలోని వారికి 45 శాతం, రిటైల్‌ రంగంలోని వారికి 59 శాతం వచ్చే అవకాశాలు ఉన్నాయట. అలానే టాల్కం పౌడర్‌, అమోనియా, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, హెయిర్‌ డస్ట్‌, సింథటిక్‌ ఫైబర్లు, కలర్స్, సెల్యులోజ్‌, ఫార్మాల్డిహైడ్‌, ప్రొపెల్లెంట్‌ గ్యాస్‌లు, పెట్రోల్ రసాయనాలతో 8 ఏళ్లకు మించి పనిచేస్తున్న వారికి 40 శాతం ముప్పు అధికం అని చెప్పుకొచ్చారు.

Also Read: WI vs IND: హైదరాబాద్ పేసర్ జోరు.. రెండో టెస్టులో విజయం దిశగా భారత్!